లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే, ఎలా?

లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలంటే ఏం చేయాలి, ఆ దేవత నివాస స్థానాలు ఏవి అనే విషయాలను జ్యోతిష్కుడు వివరించారు.

వ్యాపారంలో గానీ, వ్యవహారంలో గానీ కోపం పనికిరాదు. మీరు కోపస్వభావంతో వుంటే మీ క్రిందవాళ్ళు భయపడతారు. ఆ భయంతో సరైన నిర్ణయం తీసుకోలేరు. ఒకటి చేయబోయి మరొకటి చేస్తారు. తద్వారా నష్టం వచ్చేది మీ సంస్థకే మీరు ఆవేశపరులైతే టాలెంట్ ఉన్నవాళ్ళు మీతో పనిచెయ్యటానికి ఇష్టపడరు. ఆవేశపడినందుకే వశిషుడు కొంగగా మారాల్సి వచ్చింది. ధనమనే తపఃశక్తిని పోగొట్టుకోవాల్సి వచ్చింది.

లక్షీదేవి ఇంట్లోకి రావాలంటే

= ప్రధాన ద్వారం తెరిచి, మిగతా తలుపులన్నీ వేసి ఆపై లైట్లు వేయాలి.
= లక్ష్మీదేవి వచ్చిన గుమ్మం నుంచే వెళ్ళాలనే నియమం లేదు.
= గృహస్తులే కాదు గృహము కూడా శుచీ, శుభ్రతతో ఉంచాలి. ముంగిట్లో కూడా లక్ష్మీకళ కనపడాలి. అప్పుడే లక్ష్మీదేవి ముంగిట్లోంచి ప్రధాన ద్వారం గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
= గుమ్మం వద్ద అటూ, ఇటూ చెప్పలు లక్ష్మీదేవి వెనక్కి మరల్చే శక్తులు. లక్ష్మీ పీఠం. కాలితో తొక్కి లోనికి, బైటికి వచ్చి వెళ్తుండకూడదు.
= ఎవరైనా డబ్బులిస్తే వేళ్ళను నోటితో తడిచేసుకొని లెక్కించవద్దు. అలా చేస్తే దోషం.

How Lakshmi Devi enters your house?

శ్రీ లక్ష్మీ నివాసస్థానాలు

సత్యవంతులలోనూ, శ్రీవిషుభక్తులలోనూ, సలక్షణమైన గృహంలోనూ, వీరత్వము గలవారిలోనూ ఇంకా జయధ్వజమునందూ, ఆవుల యందూ, ఛత్రచామరముల యందూ, యజ్ఞవాటికల యందూ, తామరపువ్వుల యందూ, పంటభూములలోనూ, దీపములలోనూ, మంగళకరమైన వస్తువుల్లోనూ శ్రీవిష్ణసతి లక్ష్మీదేవి నివాసముంటుంది.

ఇంకా, ఇంటి ఇల్లాలి చిరునవ్వులో.తులసిచెట్టు ఉన్న గృహంలో. గోవులున్న గృహంలో, అతిథులను ఆదరించే నివాసంలో, ఇంకా ధాన్యము నందూ, ఓర్పూ సహనం యందూ, ఉసిరి చెట్టు నందూ, గొబ్బెమ్మల యందూ, కలువల యందూ, పద్మముల యందూ, తెల్లపావురాల యందూ, కన్యల యందూ, కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టిన గృహమునందూ, జీవహింస చేయని వారి ఇంటా శ్రీలక్ష్మీదేవి నివాసముంటుంది. స్థిరత్వం లేని లక్ష్మి నిలకడగా ఆ ఇంట తిష్టవేసి ఉంటుంది.

భార్యవల్లా, స్నేహితులవల్లా, బంధుహిత శ్రేయోభిలాషుల వల్లా రావటానికి ఒక్క శాతం మాత్రమే అవకాశముంది. కాని 99శాతం ధర్మబద్దమైన, నియమబద్దమైన జీవితం అనగా క్యారెక్టర్ గల వారికి సంపదలు అవకాశాల రూపంలో నడిచి వస్తాయి.

మీలో అన్నీ ఉన్నా ఓ అద్భుతాన్ని సృష్టించే మేథస్సు ఉన్నా క్యారెక్టర్ లేకపోతే వెలుగులోకి రాలేరు. ధనం ద్వారా పొందే మహా సుఖాలను మీరు పొందలేరు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+