వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాస్తు, జాతక ప్రభావం మనిషిపై ఎలా ఉంటుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం, ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

జ్యోతిష్యం + వాస్తు= సంపూర్ణ జీవితం సూర్యుని నుండి మొదలుకుని ఆకాశంలో కనపడే ప్రకాశ పదార్థాలను గురించి వివరించే శాస్తమ్రిది. అనగా నక్షత్రాలు, గ్రహాలు, తోకచుక్కలు మొదలైన ఆకాశంలో కనిపించే వివిధ కాంతి పదార్థాలను గూర్చి తెలిపేది జ్యోతిషం అని కొందరి అభిప్రాయం. కొందరి దృ ష్టిలో ఫలిత బాగంతో సంబంధం లేని ఖగోళ శాస్తమ్రే జ్యోతిష్యం. మరికొందరి అభిప్రాయం లోనైతే సిద్ధాంత భాగంతో సంబంధంలేని ఫలిత జ్యోతిష్యమే జ్యోతిశ్శాస్త్రం.

అనాది నుండి నేటి వరకు మానవ జీవితంపై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాలు అధికంగా చూపే జ్యోతిష్య శాస్త్రం యొక్క నిర్వచనాలు కనిపిస్తున్నాయి.

How Vastu and Jyothishyam affected people?

ఈ శాస్తమ్రు మానవులకు మూఢనేత్రము లాంటిది. ఏదైనా ఒక విషయాన్ని వివరంగా తెలుపటాన్ని శాస్తమ్రు అంటారు. అలాంటి జ్యోతిష శాస్తమ్రులో 1. సిద్ధాంత, 2. సంహిత, 3. హోర, 4, శకున 5. ప్రశ్న విభాగాలుగా ఉన్నాయి.

అందుకే జ్యోతిషశాస్త్రాన్ని పంచ స్కందత్రయమని అన్నారు. ఇందులో ప్రతి విభాగానికి ఒక ప్రత్యేకత ఉన్నది. సకల మంత్రములలోను గాయత్రి ఎంత ప్రధానమో సకల శాస్త్రాలలో జ్యోతిష్య శాస్త్ర ప్రాధాన్యత అంతే. ఇందులో ముఖ్యంగా సిద్ధాంత భాగాన్ని పరిశీలిస్తే గణిత, ఖగోళ శాస్త్రాల గురించి చెప్పారు.

హోరా భాగాన్ని చూస్తే జనన సమయ నిర్ధారణ, జాతక నిర్మాణము, షోడశ వర్గులు సాధన చేసే విధానం ప్రతివారికి ఉపయోగపడే వివిధ రాజయోగాలు, పూర్వ జన్మ విశేషాలు మొదలగునవి ఉంటాయి. సంహిత భాగాన్ని పరిశీలిస్తే అందులో మనకు వాస్తుకు సంబంధించిన అనేక విషయాలు కనబడతాయి.దేవాలయ, తటాక(చెరువులు,బావులు) గ్రామ, గృహ, శిల్ప వాస్తులన్నీ అందులోనే కనబడతాయి. అంతేగాక జలార్గళం, వివిధ రత్నాలు, పశు సాముద్రికం, అంగ సాముద్రికం మొ అంశాలను గమనించవచ్చు.

How Vastu and Jyothishyam affected people?

జ్యోతిష్య శాస్తమ్రులోని సంహిత భాగాన్ని తీసుకున్నట్లయితే 'సంహిత' అనగా కూర్చబ డేది, పేర్చబడేది అని అర్థం. అనేక రకాల అంశాలను కలిపి ఇందులో పేర్చి మనకి అందించారు. జ్యోతిష శాస్తమ్రులోని సంహిత భాగంలోని ఒక భాగమే వాస్తుశాస్తమ్రు. అం టే జ్యోతిష్యశాస్తమ్రులోని ఒక భాగమే వాస్తు శాస్తం.కేవలం వాస్తు శాస్త్రాన్నే నమ్మి, జ్యోతిష్య శా స్త్రాన్ని వదిలేస్తే సరిపోతుందా? దశలను చెప్పేది జ్యోతిషశాస్తమ్రు, దిశలను సూచించేది వాస్తు శాస్తమ్రు.

'దశ బాగుంటే, దిశ బాగుంటుంది' అన్న నానుడి అందరికీ తెలిసిందే. అంటే జ్యోతిషం ప్రకారం నడుసుస్తున్న దశలు బాగున్నప్పుడే మనం ఉంటున్న దిశలు (వాస్తుప్రకారం) బాగుంటాయి అన్నది అర్థ వంతమైన సంగతే కదా!

దశలు, దిశలు సరిచేసుకున్నప్పుడే వ్యక్తి జీవితం బాగుంటున్నది. కుటుంబానికి వాస్తు, జ్యోతిష్యం రెండూ రెండు కన్నులే గాని 'కేవలం వాస్తే ప్రధానం కాదు. జ్యోతిషమే ప్రధానం' అని అనుకోకూడదు.

వ్యక్తి జీవిత చక్రంలో ఉన్న సమస్యలను సరిగా విశ్లేషించి నడుస్తున్న దశలు, అంత ర్ధశలు, గోచార ఫలితాలు గమనించి ఎలాంటి సమస్యలను అతను ఎదుర్కొంటున్నాడు గమనించి దానికి తగిన రెమెడీస్‌ (పరిహార క్రియలు అనగా జపం, దానం, శాంతి, హోమం, రత్నధారణ మొదలగునవి పాటించి ఆ ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి బయటపడగలిగిన తరువాతే ప్రశాంతత లభ్య మవుతుంది.

జాతకం యొక్క ప్రభావం మనిషి పై ఉంటుంది.
అలాగే మనం ఉంటున్న ఇంటికి సంబంధించిన వాస్తును సరిచేసుకోవాలి.

అనగా ఎలాంటి ఇంట్లో వుండాలి? ఏ ముఖ ద్వారం ఉండాలి. అలాగే ఇల్లంతా,ఇంటి లోపల, బయట కూడా వాస్తు ప్రకారం ఉందా? వీధి శూలలు, వెన్ను శూలలు లేకుండా చూసుకోవాలి.ఇంటి చుట్టూ ప్రహారీ (కంపౌండ్) ఉండాలి. అంతేగాక ఇంట్లో మనం ఉపయోగించుకునే వస్తువులన్నీ వాస్తు ప్రకారం అమర్చుకోవాలి.

వ్యక్తి పైన జాతకం ప్రభావం దాదాపు జాతకం 60 శాతం ఉంటే, వాస్తు 40 శాతం ఉంటుంది. రెండూ సరిగ్గా ఉండాలి. ఏది సరిగ్గా లేకపోయినా దాని ప్రభావం ఆ వ్యక్తిపైన మరియు అందులో నివసించే వారిపై తప్పక దాని తాలూకు మంచి/చెడు ఫలితం అనుభవించక తప్పదు. ఇంకో విచిత్రమైన అంశం ఏమిటంటే మనకు జాతకరిత్యా నడుస్తున్న దశలు సరిగా లేనప్పుడు మనం ఉండే గృహం కూడా వాస్తు సరిగ్గా లేనిదే అవుతుంది.

దీన్ని బట్టి మనకి అర్థం అవుతున్న అంశం ఏమిటి అంటే మన జాతకాన్ని ముందుగా పరిశీలింప జేసుకుని ఎదుర్కొంటున్న సమస్య లు,ఎలాంటి రూములో, ఎలాంటి ద్వారము,వాస్తు దోశం వలన ఎలాంటి సమస్యలున్న ఇంట్లో ఉత్పన్నం అవుతున్నాయో కేవలం శాస్త్రపరిజ్ఞానం వారి ద్వార తెలుసుకుని నివారణలు పాటించాలి. నడుస్తున్న దశలను బట్టి పరిహార ప్రక్రియలు వ్యక్తి పాటింస్తే 60 శాతం ఊరట కలుగుతుంది.

ద్వారానికి, ఇంటికి గాని ఉన్న సమస్యను కూడా వాస్తు ప్రకారం సరిచేస్తే పూర్తిస్థాయి మంచి ఫలితాన్ని ఇంట్లో ఉండే వాల్లు అనుభవించగలడు.

ఎవరైనా సరే జ్యోతిష ప్రకారం నడిచే దశలను, గోచారాన్ని ముందుగా చూపించుకొని జీవితంలో ఆశిస్తు న్నవి అనగా సంసారం, పిల్లలు, ఆయుష్షు, ఆరోగ్యం, ఉద్యోగం మొదలగు విషయాలు ఉన్నాయి. ప్రతిబంధకాలు ఏం ఉంన్నాయి? అవి సరిచేసుకోగలమా? జ్యోతిష పరంగానూ, పరిహారక్రియలను ప్రయోగించి ఆయా అంశాలను సవరించుకోవాలి.

ఆ తర్వాత వాస్తు పరంగా ఇల్లు ఉందా? లేక ఇల్లు మారటానికైనా, మార్చటానికైనా తగిన బలాన్ని సాదించుకోవటానికి ఏం చేయా లి? జోతిష పరంగా అని ఆలోచన చేయాలి. జ్యోతిష్య, వాస్తు సమ్మేళనాన్ని ఉపయోగించి జీవితాన్ని బాగుచేసుకోవాలి.

జ్యోతిషశాస్త ప్రరంగా మనకి లేని నుదుటిరాతను వాస్తు బాగున్న ఇంటిలో ఉండి పొందలేము. వాస్తు బాగుండని ప్రదేశంలో నివశిస్తున్నా జ్యోతిషపరంగా రావలసిన యోగాలని ఎలాంటి అడ్డంకులు, ప్రతిబంధకాలు లేకుండా సాధించలేము. రెండూ కావాలి. రెండింటిలోనూ లోపాలను పరిహారక్రియల ద్వారా సరిచేసుకోవాలి.

ఎవరైనా సరే జాతకంలో వున్న దోషాలను ముందుగా పరిహార ప్రక్రి యల ద్వారా సంపూర్ణంగా సరిదిద్దు కోవాలి. అలాగే వాస్తు దోషాలు సరి చేసుకోవాలి. జాత కాన్ని మార్చలేము గాని, వాస్తు మార్చుకోవచ్చు. కనుక అలా మార్చటానికి వీలైన పరిస్థితులు కల్పించేది ఆ వ్యక్తి జాతక బలమే.
అందుకే జ్యోతిష్యశాస్త్రాన్నే ప్రధానంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

English summary
How Vastu and Jyothishyam affected people?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X