పూజలో కొబ్బరికాయ క్రుళితే మంచిదా కాదా?
పూజలో కొట్టిన కొబ్బరి కాయ కుళ్లిపోతే మంచిది కాదా.. కొన్ని సందర్భాల్లో అది మరీ మంచిదంటారు. జ్యోతిష్కుడు ఏమంటున్నారు
పూజలో కొట్టిన కొబ్బరికాయ దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి చేసిన పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు.

అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్ని తీసేసీ కాళ్ళూ చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది.
వాహనాలకి కొట్టే కాయ కుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి.మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.












Click it and Unblock the Notifications