అక్కడ పుట్టుమచ్చ ఉంటే కోటీశ్వరులవుతారు!

మన శరీరంలో వివిధ భాగాల్లో నలుపు రంగులో లేదంటే గోధుమ రంగుల్లో మచ్చలు కనిపిస్తాయి. ఇవి చాలా ప్రత్యేకమైనవి. అవి ఉన్న శరీరంలోని భాగాన్ని బట్టి అర్థం మారుతుంది. కొన్ని మన భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి. మనిషి వ్యక్తిత్వం కూడా పుట్టుమచ్చను బట్టి తెలుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రెండు లేదంటే మూడు మచ్చలు కూడా ఉంటాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం శరీరంలో కొంత భాగం వల్ల మనకు ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. మచ్చలను కణాల సమూహంగా పేర్కొంటారు. శరీరంలోని పుట్టుమచ్చ మనిషికి సంపదను తెచ్చిపెడుతుంది.

నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే ఆత్మవిశ్వాసంతో ఉంటారు. జీవితంలో విజయం సాధిస్తారు. జీవితంలో మంచి స్థితికి చేరుకుంటారు. స్త్రీకి నుదురు మధ్య రేఖపై పుట్టుమచ్చ ఉంటే ప్రయాణానికి అవకాశం ఉంటుంది. కుడివైపు ముఖంపై పుట్టుమచ్చ ఉంటే సంపదకు, జ్ఞానానికి చిహ్నం. వీటివల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఎడమవైపు ఉంటే జీవితంలో ప్రశాంతత ఉండదు. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

if moles in this part of body are very lucky

నుదురుకు కుడివైపు పుట్టుమచ్చ ఉంటే వ్యాపారంలో, వైవాహిక జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో విజయాన్ని ఇస్తుంది. ఇలాంటి పుట్టుమచ్చ వల్ల ఐశ్వర్యం దొరుకుతుంది. మెడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీకి ఓర్పుతోపాటు జ్ఞానం ఉంటుంది. ఇలాంటివారు ఎంతో కష్టపడి తమ కలలను సాధించుకుంటారు. అన్నివిధాలుగా విజయం సాధిస్తారు.

అపారమైన సంపదను కూడా పొందుతారు. కనుబొమల మధ్య మచ్చ ఉంటే అమ్మాయిలు ఎంతో అదృష్టవంతులు. స్త్రీకి కుడివైపు లేదంటే ఎడమవైపు మచ్చ ఉంటే సంపదను పొందడానికి సంకేతం లాంటిది. స్త్రీకి నడుముపై పుట్టుమచ్చ ఉంటే సంపదతోపాటు శ్రేయస్సుకు చిహ్నం. తుంటిపై పుట్టుమచ్చ ఉంటే విద్యలో రాణిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+