వాస్తు ప్రకారం సరైన దిశ ఉంటే దశ తిరుగుతోంది.. మీ దిశ తెలుసుకోండి
మనకు వేదకాలం నుంచి వాస్తు శాస్త్రం ఉంది. ఇంటి నిర్మాణాల సమయంలో కచ్చితంగా దీన్ని అనుసరించే నిర్మిస్తారు. అథర్వ వేదంలో ఉండే స్థాపత్య వేదమే వాస్తు శాస్త్రంగా మారింది. వాస్తు సరిగా లేనప్పుడు ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం లాంటివి వేధిస్తుంటాయి. ఎవరైనా ఆ ఇంటికి వాస్తు సరిగా లేదండీ అంటే అద్దెకు ఉండటానికి కూడా ఎవరూ రాని రోజులు. అందుకనే ఇల్లు నిర్మించుకొనేటప్పుడు వాస్తును అనుసరించడం చాలా ముఖ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు.
తూర్పు దిశ
ఈ దిశకు రాజు సూర్య భగవానుడు.
ఇంట్లోకి ప్రవేశించాలంటే దీన్ని మించిన దిక్కు ఉండదు.
తూర్పు దిశలో ప్రవేశద్వారం ఉంటే చాలా మంచిది.
ఉదయాన్నే సూర్యకాంతి శరీరంపై పడితే మంచి ఆరోగ్యం.
ఈ దిశలోనే గార్డెన్, డ్రాయింగ్ రూం, లివింగ్ రూం ఉండాలి.

పడమర దిశ
ఈ దిక్కు కుటుంబానికి శక్తినిస్తుంది.
జిమ్ వంటిని ఈ దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి.
ఓవర్ హెడ్ ట్యాంకు కూడా ఉండొచ్చు.
బెడ్ రూం, డైనింగ్ రూంలు ఉండాలి.
ఉత్తర దిశ
ఈ దిక్కు సంపదనిస్తుంది.
పడక గది, ద్వారం, గార్డెన్ ఏర్పాటు చేసుకోవచ్చు.
ప్రవేశద్వారం తూర్పు వీలు కాకపోతే ఉత్తరం పెట్టుకోవచ్చు.
రెండు దిక్కుల్లో కూడా ప్రవేశ ద్వారం పెట్టుకోవచ్చు.
దక్షిణ దిశ
ఈ దిక్కున మాస్టర్ బెడ్ రూం ఉండాలి.
ఇంట్లో పెద్దవారు అందులో ఉండాలి.
చిన్నవారు నిద్రించకూడదు.
హోం థియేటర్ లాంటివి ఈ దిక్కులోనే ఉండాలి.
సమాజంలో గౌరవ మర్యాదలు ఈ దిక్కువల్లే కలుగుతాయి












Click it and Unblock the Notifications