మీరు ఈ నక్షత్రాల్లో జన్మిస్తే: వ్యాపారంలో నేర్పరి
మీరు ఈ నక్షత్రాల్లోని వివిధ పాదాల్లో జన్మించి ఉంటే మీ జాతకం ఎలా ఉంటుంది, మీ లక్షణాలు ఎలా ఉంటాయనే విషయాన్ని జ్యోతిష్కుడు వివరించాడు.
విశాఖ నక్షత్రంలో జన్మిస్తే:
ఈ విశాఖలో ఏ పాదంలో పుట్టినా పురుషులకు సూక్ష్మబుద్ధి, వివేకం, యుక్తి, పొదుపు, దయ, ఇంద్రియ నిగ్రహం, అసూయ, లోభగుణం, కరుణ, సృష్టంగా మాట్లాడే స్వభావం, నేర్పరితనం, బంధువర్గానికి ఉపకారం చేసే నైజం వుంటాయి. పండితులకు, మహిళకు ఇష్టులవుతారు. మంచి సంపాదన వుంటుంది. కడుపు, ముఖం, మర్మస్థానాల్లో మత్స్యరేఖలు వుంటాయి. విశాఖ మహిళలకు కోమల శరీరం, కలుపుగోలుతనం, మిత్రప్రేమ వుంటాయి. సంపన్నురాలు కాగలదు. విశేషంగా తీర్థయాత్రలు చేస్తుంది.
మొదటి పాదంలో పుట్టినవారు: ఎత్తయిన రొమ్ము, జ్యోతిషంలో ఆసక్తి, క్రయవిక్రయ వ్యాపారంలో నేర్పరి, శత్రువును జయించే సమర్థత, దుష్టకార్యాచరణ వుంటాయి.
రెండవ పాదంలో పుట్టినవారు: న్యాయమార్గాలలో సంపాదిస్తారు. కర్ణరోగం వేధిస్తుంది. రూపపతితో వివాహం అవుతుంది. ఇంగిత జ్ఞానం, న్యాయచింతన వుంటాయి.
మూడవ పాదంలో పుట్టినవారు: మిథున బుధ నవాంశలో జన్మి స్తే శరీరపుష్టి, లలితకళలో అభిరుచి, సంగీతజ్ఞానం, నటనా నైపుణ్యం, అందం, మాటకారితనం, యుక్తాయుక్త విచక్షణ, నేత్రవ్యాది, ప్రజ్ఞ, నిర్మలమైన మనస్సు వుంటాయి. పొట్టిగా వుంటాయి.

నాల్గవ పాదంలో పుట్టినవారు: చిత్రలేఖనం, కళానైపుణ్య, సౌందర్యం, నిర్మలమైన మనస్సు, విద్య, విజ్ఞానం, మాటకారితనం, ధర్మగుణం, అండరోగం, మహిళలను ఆకర్షించే స్వభావం వుంటాయి.
స్వాతి నక్షత్రంలో జన్మిస్తే:
ఏ పాదంలో పుట్టిన పురుషులైనా స్వతంత్రులు, బుద్ధిమంతులు, ధైర్యవంతలు అవుతారు. పెద్దల పట్ల గౌరవం, నమ్రత వుంటాయి. అనేక భోగభాగ్యాలు అనుభవించగలరు. బంధువర్గాని ఇష్టులవుతారు. కీర్తి గడిస్తారు. వీరి హృదయం విశాలమైంది.
మొదటి పాదంలో పుట్టినవారు: ధన గురు నవాంశలో జన్మిస్తే ధీరత్వం, మాట నేర్పు, వక్తృత్వం, సర్వజ్ఞత వుంటాయి.
రెండవ పాదంలో పుట్టిన వారు: మకర శని నవాంశలో పుడితే ధర్మవర్తన, మూఢత్వం, ఎల్లప్పుడు రహస్యమైన పనులు నిర్వహించడంలో నైపుణ్యం, పరుల కార్యములు నిర్వహించే ఆసక్తి వుంటాయి.
మూడవ పాదంలో పుట్టినవారు: కుంభ శని నవాంశలో పుట్టినవారికి పెద్దల పట్ల గౌరవం. విధేయత, అభిమానం, మంచి నడవడి, రోషం, గర్వం, చాపల్యం సాధువర్తన వుంటాయి. సంపున్నులు కాగలలరు.
నాలుగవ పాదంలో పుట్టిన వారు: మీన గురు నవాంశలో పుట్టినవారికి రచనాశక్తి, పరిశీలనాతత్త్వం, కార్యనైపుణ్యం, ప్రదర్శన, చాపల్యం మొదలైన స్వభావాలుంటాయి.












Click it and Unblock the Notifications