ఈ నక్షత్రంలో జన్మిస్తే సినీనటులవుతారా?
విశాఖ నక్షత్రంలోని ఏ పాదంలో పుట్టినా పురుషులకు సూక్ష్మబుద్ధి, వివేకం, యుక్తి, పొదుపు, దయ, ఇంద్రియ నిగ్రహం, అసూయ, లోభగుణం, కరుణ, సృష్టంగా మాట్లాడే స్వభావం, నేర్పరితనం, బంధువర్గానికి ఉపకారం చేసే నైజం వుంటాయి.
పండితులకు, మహిళకు ఇష్టులవుతారు. మంచి సంపాదన వుంటుంది. కడుపు, ముఖం, మర్మస్థానాల్లో మత్స్యరేఖలు వుంటాయి. విశాఖ మహిళలకు కోమల శరీరం, కలుపుగోలుతనం, మిత్రప్రేమ వుంటాయి. సంపన్నురాలు కాగలదు. విశేషంగా తీర్థయాత్రలు చేస్తుంది. సినీనటులు అయ్యేవారిలో చాల మంది ఈ నక్షత్రంలో జన్మించిన వారే.
మొదటి పాదంలో పుట్టినవారు: ఎత్తయిన రొమ్ము, జ్యోతిషంలో ఆసక్తి, క్రయవిక్రయ వ్యాపారంలో నేర్పు, శత్రువును జయించే సమర్థత, దుష్టకార్యాచరణ వుంటాయి.

రెండవ పాదంలో పుట్టినవారు: న్యాయమార్గాలలో సంపాదిస్తారు. కర్ణరోగం వేధిస్తుంది. రూపపతితో వివాహం అవుతుంది. ఇంగిత జ్ఞానం, న్యాయచింతన వుంటాయి.
మూడవ పాదంలో పుట్టినవారు: మిథున బుధ నవాంశలో జన్మి స్తే శరీరపుష్టి, లలితకళలో అభిరుచి, సంగీతజ్ఞానం, నటనా నైపుణ్యం, అందం, మాటకారితనం, యుక్తాయుక్త విచక్షణ, నేత్రవ్యాది, ప్రజ్ఞ, నిర్మలమైన మనస్సు వుంటాయి. పొట్టిగా వుంటాయి.
నాల్గవ పాదంలో పుట్టినవారు: చిత్రలేఖనం, కళానైపుణ్య, సౌందర్యం, నిర్మలమైన మనస్సు, విద్య, విజ్ఞానం, మాటకారితనం, ధర్మగుణం, అండరోగం, మహిళలను ఆకర్షించే స్వభావం వుంటాయి.












Click it and Unblock the Notifications