Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Vastu Tips: మీ ఇంట్లో ఆ మొక్క ఉందా.. అయితే జాగ్రత్త..

చాలా మంది మొక్కలు పెంచుకోవడం అంటే ఇష్టముంటుంది. ముఖ్యంగా పూల మొక్కలను ఎక్కువగా పెంచుతారు. తాజాగా ఇప్పుడు చాలా మంది మనీ ప్లాంటు మొక్కలను పెంచుతున్నారు. మనీ ప్లాంట్లను పెంచడం వల్ల ఆర్థిక చింతలు తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే ఇంట్లో మనీ ప్లాంట్ నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ చెట్టు ఉన్న ఇంట్లో డబ్బు, ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది అని నమ్ముతారు. కానీ, ఈ మనీ ప్లాంట్ పెట్టడానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

ఈశాన్యంలో

ఈశాన్యంలో


ఈ నియమాలు పాటించకపోతే లాభాల కంటే నష్టమే ఎక్కువట. మనీ ప్లాంట్లను నాటేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని నియమాలు ఉన్నాయి. వాస్తు శాస్త్రం ఏదైనా విషయంపై దిశానిర్దేశం చేస్తుంది. దీని ప్రకారం, ఈశాన్యంలో మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఉంచవద్దు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఆగ్నేయ దిశలో

ఆగ్నేయ దిశలో

మనీ ప్లాంట్‌ను ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో ఉంచండి. ఎందుకంటే, ఈ దిక్కును వినాయకునికి దిక్కుగా భావిస్తారు. కాబట్టి ఈ దిశలో మనీ ప్లాంట్‌ను ఉంచినట్లయితే, ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. వాస్తు ప్రకారం, మనీ ప్లాంట్ పెరిగేకొద్దీ, వ్యక్తి సంపద పెరుగుతుందట. మనీ ప్లాంట్ తీగలు నేలను తాకకుండా చూసుకోవాలి. ఈ తీగ క్రిందకు వెళ్తే ఆర్థిక నష్టం వస్తుందట.

ఎండిపోనివ్వవద్దు

ఎండిపోనివ్వవద్దు

ఈ మొక్కను ఎప్పుడూ ఎండిపోనివ్వవద్దట. దాని ఆకులు ఎండిపోతే లేదా పసుపు రంగులోకి మారినట్లయితే, వెంటనే వాటిని తొలగించండి. ఎండిపోయిన మనీ ప్లాంట్ ఇంట్లో దురదృష్టాన్ని తెస్తుంది. ఆరుబయట మనీ ప్లాంట్లను ఎప్పుడూ నాటకండి. బయటి వ్యక్తి గుర్తిస్తే మనీ ప్లాంట్ ఎదుగుదల ఆగిపోతుందని అంటున్నారు. ఇది ఇంట్లో ఏ వ్యక్తినైనా ప్రభావితం చేస్తుంది. ఈ మొక్కను ఎల్లప్పుడూ ఇంటి లోపల నాటండి.


Note: ఇక్కడ అందించిన సమాచారం కేవలం వాస్తవాల నిపుణుల అభిప్రాయం మాత్రమే. దీనిని వన్ ఇండియా ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+