ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటే వాస్తు ప్రకారం ఈ నియమాలు కచ్చితంగా పాటించాలి!
ఈరోజుల్లో ప్రతి ఇంటికి అటాచ్డ్ బాత్‌రూం కచ్చితంగా ఉంటోంది. గతంలో ఇంటికి కొంచెం దూరంగా మరుగుదొడ్డి కట్టేవారు. కానీ రోజురోజుకు భూమి విలువ పెరుగుతుండటంతో ఉన్నదాంట్లోనే సరిపెడుతున్నారు. మరుగుదొడ్లను కూడా బెడ్ రూంలకు అనుబంధంగా కట్టేస్తున్నారు. అదే సమయంలో వాస్తును కూడా అనుసరించే కడుతున్నారు. వాస్తు ప్రకారం బెడ్ రూం అనేది మన శక్తిని, ఆర్థిక పరిస్థితిని, ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అటువంటి గదికి అటాచ్డ్ బాత్‌రూం ఉంటే వాస్తు ప్రకారం ఏ నియమాలు పాటించాలనే విషయాన్ని తెలుసుకుందాం.
అటాచ్డ్ బాత్రూమ్ బెడ్‌రూమ్ పశ్చిమ దిక్కులో లేదంటే వాయువ్యంలో ఉండాలి.
చాలా చిన్న అంశంగా కనిపించినప్పటికీ టాయ్ లెట్ అంశం అనేది చాలా కీలకం.
చెక్క తలుపులను ఉపయోగించాలి.
బాత్ రూం డోర్ నేరుగా బెడ్ రూంలోని మంచం వైపు ఉండకూడదు.
బాత్ రూం తలుపును ఎప్పుడూ మూసివుంచండి.

అద్దాలను తూర్పువైపు గోడలప ఉంచాలి.
నలుపు, ఎరుపు రంగులను వాడొద్దు.
లైట్ రంగులు, లైట్ నీలం, క్రీమస్, సాఫ్ట్ వైట్స్ వాడాలి.
బాత్రూంలను గాలి, నీరు నియంత్రిస్తాయి.
అందుకే వాటిని సక్రమంగా నిర్వహించాలి.
బాత్రూమ్ కు, బెడ్ రూంకు మధ్య ఉండే గోడమీద వాస్తు పిరమిడ్ పెట్టాలి.
అలాగే సమద్రపు ఉప్పును లేదంటే కర్పూరాన్ని చిన్న గిన్నెలో పెట్టి ఉంచాలి.
వారానికోసారి వీటిని మారుస్తుండాలి.
టాయ్ లెట్ ఉత్తరం లేదంటే దక్షిణం వైపు ఉండాలి.
మీ తలను ఎప్పుడూ బాత్రూమ్ గోడకు ఆనించకూడదు.
దీనివల్ల నిద్రాభంగం అవుతుంది.
కుళాయిలు రిపేరులో ఉంటే వెంటనే బాగుచేయించాలి.
నీరు లీకైతే ఆర్థిక సమస్యలు వస్తాయి.
బాత్రూమ్ లో మంచి వెంటిలేషన్ ఉండాలి.
ఎగ్జాస్ట్ ఫ్యాన్ ను ఏర్పాటు చేసుకోవాలి.
బాత్రూమ్ చండాలంగా ఉంటే సానుకూలశక్తిని ప్రవేశించనివ్వదు.












Click it and Unblock the Notifications