హోలీ నాడు మీ ఇంట్లో ఈ వస్తువులు ఉంటే నష్టాలు తప్పవా ..!

దేశ వ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకునే పండుగల్లో హోలీ ఒకటి. హోలీ పండుగ తమ జీవితాల్లో కొత్త రంగులు తీసుకురావాలని అంతా కోరుకుంటారు. సాధారణంగా ప్రతి ఏడాది హోలీ పండగను భారతదేశంలో ఫాల్గుణ మాస పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఈ సంవత్సరంలో పౌర్ణమి మార్చి 14న వచ్చింది. అయితే హోలీ పండగ నిర్వహించడానికి ముందు హోలికా దహనం చేయాల్సి ఉంటుంది. అది కూడా శుభ ముహూర్తం నిర్ణయించి రాత్రి సమయంలో నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది హోలికా దహనాన్ని మార్చి 13న అంటే గురువారం రోజున నిర్వహించాలి. అయితే హోలికా దహనం భద్ర కాలంలో చేయకూడదు. అయితే మార్చి 13 గురువారం రాత్రి 10.37 వరకు భద్ర కాలం ఉంది. అందువల్ల చాలా ప్రాంతాల్లో శుభ ముహూర్తం చూసుకొని గురువారమే హోలికా దహనం చేయడానికి నిర్ణయించారు. దీంతో హోలీ పండుగ మార్చి 14 శుక్రవారం రోజున ఫిక్స్ అయ్యింది.

అయితే కొన్ని వాస్తు నియమాలు పాటించడం ద్వారా హోలీ సంతోషంతో పాటు సంపద కూడా తీసుకువస్తుందని వేద పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం హోలికా దహనం ముందు మీ ఇంటి నుంచి ఈ వస్తువులను కచ్చితంగా తొలగించాలని సూచిస్తున్నారు. లేదంటే తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆ వస్తువులు ఏంటో మీకోసం ప్రత్యేకంగా...

If you have these items in your house on Holi loss happens

హోలీకా దహనం రోజు ఇంట్లో ఉంచుకోకూడని వస్తువులు..

పాత చెప్పులు..

సాధారణంగా పండుగ నాడు ఇళ్లను శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అయితే పాత చెప్పులను, బూట్లను క్లీన్ చేసి అలాగే వాడుతుంటారు. అయితే వాస్తు శాస్త్రం ఇలా ఎప్పటికీ చేయకూడదని సూచిస్తుంది. చినిగిన బూట్లు, వాడని పాదరక్షలను ఇంట్లో ఉంచడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని.. అందుకే వాటిని ఇంటి నుంచి వాటిని తొలగించాలని చెబుతున్నారు.

విరిగిన/ పగిలిన వస్తువులు..

హోలీ దహనానికి ముందు మీ ఇంట్లో ఏదైనా పగిలిన అద్దాన్ని లేదా దేవుని విగ్రహం ఏదైనా విరిగిపోయి ఉంటే వెంటనే వాటిని ఇంట్లో నుంచి తొలగించాలని అంటున్నారు. వాటిని ఏదైనా నదిలో లేదా ప్రవహించే నీటిలో వదిలేయాలన్నారు.

చీపురు..

హోలికా దహనం ముందు మీ ఇంట్లోకి పాత చీపురును తీసేసి కొత్త చీపురు కొనాలని సూచిస్తున్నారు. అయితే పాత చీపురును ఎక్కడబడితే అక్కడ పడేయకుండా మట్టిలో పాతిపెట్టాలని చెబుతున్నారు.

తులసి చెట్టు ..

హోలికా దహనం రోజు కంటే ముందే ఇంట్లో ఉన్న తులసి చెట్టు ఎండిపోయి ఉంటే వెంటనే దాన్ని మార్చాలని వెల్లడిస్తున్నారు. పౌర్ణమి రోజున తులసిని మార్చడం శుభప్రదంగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+