వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆషాఢ మాసం విశేషాలు: ఆచరించాల్సిన నియమాలు..

ఇంటిలో వున్న ఇత్తడి దీప స్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్యపలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు.

|
Google Oneindia TeluguNews

ఇది సంవత్సరంలో నాలుగో మాసం. ఆషాఢమాసంలో గృహనిర్మాణానికి ఆరంభించిన భృత్య రత్న పశుప్రాప్తి అని మత్స్య పురాణము. ఆషాఢమాసంలో ఒకసారైనా గోరింటాకు పెట్టుకోవాలంటారు. ములగ కూర బాగా తినాలి అంటారు. అనపపప్ప వాడాలంటారు.

ఆషాఢశుద్ద పంచమి "ఆషాఢశుద్ధ పంచమ్యాం వచ్చెనె వద్ద గౌతమీ అధవా తప్పిదారేణ ద్వాదశ్యామది తప్పదు." అని గోదావరి తీరవాసుల్లో ఒక చాటూక్తి కలదు. ఆషాఢశుద్ధ పంచమిని తప్పితే ద్వాదశని గౌతమికి వరదనీరు వస్తుందని పై చాటూక్తి భావం.

Importance of Ashada Masam

'ఆడిపదినెటు' అని కావేరీతీరవాసులు ఒక పండుగ చేస్తారు. ఆడిపదినెటు అనగా ఆషాఢమాసం పద్దెనిమిదో రోజు అని అర్థం. ప్రాయికంగా ఆనాటికి కావేరికి కొత్తనీళ్ళ వస్తాయి. వ్యవసాయపు పనులకు తరుణం అవుతుంది. ఆడి మాసం ఇంచుమించు మన ఆషాఢమాసం,
ఆషాఢశుద్ధ షష్టి స్కందవ్రతము -స్మృతికౌస్తుభం ఈ వ్రతములో సుబ్రహ్మణ్యేశ్వరుని షోడపచారాల చేత పూజించాలి. ఉపవాసం ఉండాలి. జలమును మాత్రం పుచ్చుకోవచ్చు. మరునాడు కుమారస్వామిని దర్శించాలి. శరీరారోగ్యం కలుగుతుంది.

ఆషాఢ శుద్ద ఏకాదశి

ఆషాఢ శుక్ల ఏకాదశికి మహాఏకాదశి' అని పేరని వ్రతోత్సవ చంద్రిక అంటున్నది. గ్రంథాంతరాల్లో ప్రథమైకాదశి అనే నామం కనిపిస్తున్నది. ఏడాదికి ఇరవైనాలుగు, అధికమాసం వచ్చినప్పడు ఇరవై ఆరు ఏకాదశులు ఉంటుండగా ఈ ఒక్క ఏకాదశిని మహాఏకాదశి అనీ, ప్రథమైకాదశి అని గొప్పగా చెప్పడానికి కారణం అరయ తగింది.

తొలి ఏకాదశి ప్రథమైకాదశి అనుసంస్కత నామాన్నిపట్టి తెలుగువారు దీనిని ఆషాఢశుద్ధ అష్టమి, స్మృతికొస్తుభం దుర్గాష్టమీ, పరశురామియాష్ట్రమీ. గదాధరపద్దతి మహిషాసురమర్దనీపూజ, ఆషాఢశుద్ద నవమి ఐంద్రీ దుర్గా పూజా స్మృతి కౌస్తుభం
ఆషాఢ కృష్ణ అమావాస్య దీపపూజ

ఇంటిలో వున్న ఇత్తడి దీప స్తంభాలు, కుందెలు అన్నీ శుభ్రంగా కడుగుతారు. కొయ్యపలకల్ని పేడతో అలికి దాని మీద ముగ్గులు పెడతారు. కుందెలు, దీపస్తంభాలు ఆ పలకం మీద వుంచుతారు. స్త్రీలు ముస్తాబై దీపాలు వెలిగించి పసుపు కుంకుమలతో పూజ చేస్తారు. లడూలు, మోరుండలు నైవేద్యం పెడతారు. బ్రాహ్మడికి, ముత్తైదువుకి పెట్టుకుంటారు. సాయంకాలం దీపం వెలిగించి ఇంటి నలుమూలలా చూపిస్తారు.

English summary
There are numerous fears and doubts regarding Ashadam or Ashada Masam (June - July) especially for Telugu and Kannada speaking people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X