ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో సచిన్- అన్ స్టాపబుల్ అన్న చంద్రబాబు..!
ఆంధ్ర యూనివర్సిటీ (Andhra University) శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు (Chandrababu)..విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఏయూ వందేళ్ల పండుగతో పాటు రేపు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు కోసం తాను ఇక్కడికి వచ్చానన్నారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar)కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆర్థిక సంస్కరణలు వచ్చాక 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనం అన్నారు. గూగుల్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసిందని, 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అన్నారు.
విశాఖ విశ్వనగరం, గ్లోబల్ సిటీ అని, ఇది అన్ స్టాపబుల్ అని, ఎవరూ ఆపలేరని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో 53 యూనివర్సిటీలు ఉంటే. అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్ అన్నారు. కేవలం చదువు చెప్పడమే కాదు, తెలుగు వైభవానికి ఏయూ కృషి చేస్తోందన్నారు. విద్య, సాహిత్య రంగాల్లో ప్రముఖులను కళా ప్రపూర్ణ అవార్డుతో అభినందిస్తున్నారన్నారు. ఎంతోమంది నాయకులను తయారు చేసిన గడ్డ ఏయూ అని, రాజకీయ ఉద్దండులు ఇక్కడ నుంచి వచ్చారని తెలిపారు.

విద్యార్థులు, పూర్వ విద్యార్థులకు నాలెడ్జ్, ఇన్నోవేషన్, స్టార్టప్ లపై దృష్టి పెట్టాలని చంద్రబాబు కోరారు. మీరు ఉద్యోగం చేయడం కాదు, పది మందికి ఉద్యోగం ఇచ్చే శక్తి మీకు రావాలన్నారు. దీనికి ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా ఉందన్నారు. సంపద సృష్టించే మార్గదర్శులుగా మారే అవకాశం వీరికి ఉందన్నారు. ఎంట్రప్రెన్యూర్లుగా ఏయూ ఎంతమందిని తయారు చేస్తుందనేది మీ మీద ఆధారపడి ఉందన్నారు. ప్రపంచంలో టాప్ 100లో ఏయూ ఉండాలన్నారు. రూ.500 కోట్లు ఏయూకు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. రాబోయే వందేళ్లలో ఏయూ మరో చరిత్ర సృష్టిస్తుందని, బెస్ట్ బ్రాండ్ క్రియేట్ చేస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications