Vinod Kambli: వినోద్ కాంబ్లీ ఆరోగ్యం విషమం? స్నేహితుడి కోసం రంగంలోకి సచిన్..!

భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ (vinod kambli) ఆరోగ్యం విషమించింది. గత కొన్నేళ్లుగా తీవ్ర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కాంబ్లీ ఆరోగ్యం క్షీణించింది. ఆయన చికిత్స కోసం ఇప్పటికే పాత స్నేహితుడు సచిన్ టెండూల్కర్ (sachin tendulkar) తో పాటు పలువురు చిన్ననాటి ఫ్రెండ్స్ కూడా భారీగా ఖర్చుపెట్టారు. అయినా ఆయన కోలుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఆయన ఆరోగ్యం విషమించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో తిరిగి పాత స్నేహితుడు సచిన్ రంగంలోకి దిగారు.

శారీరకంగా మెరుగుదల సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ వినోద్ కాంబ్లీ ఇంకా కోలుకోవడం లేదు. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కాంబ్లీకి ఆర్థిక, మానసిక మద్దతు అందించడానికి సన్నిహితులు ఏర్పాటు చేసిన ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేరారు. కాంబ్లీ చిరకాల స్నేహితుడైన మార్కస్ కౌటో నేతృత్వంలో ప్రారంభమైన ఈ గ్రూప్ పలువురు మాజీ క్రికెటర్లు, శ్రేయోభిలాషులను ఒకచోట చేర్చింది.

Vinod kambli s Condition Worsens Tendulkar Joins Campaign to Raise Funds

తాను కాంబ్లీ స్నేహితులతో వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేశానని, వారి పేర్లు చెప్పకుండా, వారు ఆర్థికంగా చాలా సహాయం చేస్తున్నారని కౌటో హిందుస్థాన్ టైమ్స్‌ కు వెల్లడించారు. కాంబ్లీ జ్ఞాపకశక్తి అంతగా బాగోలేదని, ఆరు నెలలుగా అది తగ్గలేదన్నారు. అతనికి చాలా విషయాలు గుర్తుండవన్నారు. కానీ ఏదైనా గుర్తుకు వస్తే మాత్రం గుర్తుకువస్తుంది, లేకపోతే, తిరిగి గుర్తుకురావడం కష్టమవుతుందన్నారు. కాంబ్లీ మద్యం మానేసినప్పటికీ, ఇతర సమస్యలు కొనసాగుతున్నాయని కౌటో వెల్లడించారు.తదుపరి దశలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+