మరో సచిన్ వచ్చేశాడు.. కాంగ్రెస్ ఎంపీ రికమండేషన్?
ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ జట్టుపై వీరోచిత శతకంతో ఇండియాను విజేతగా నిలిపిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ యువక ఆటదాడిని క్రికెట్ దేవుడైన సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తూ కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్‌ను వెంటనే సీనియర్ జట్టులోకి తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు.
సచిన్‌తో పోలిక.. థరూర్ ఏమన్నారంటే?
వైభవ్ ఆడుతున్న ఓ వీడియోపై స్పందిస్తూ శశి థరూర్ ఎక్స్ (X) వేదికగా ఇలా రాసుకొచ్చారు. "వైభవ్ సూర్యవంశీకి అత్యున్నత గౌరవం దక్కాలి. అతడిని వెంటనే సీనియర్ జట్టులోకి ఎంపిక చేయాలి. గతంలో మనం ఇలాంటి 14 ఏళ్ల మేధావిని క్రీజులో చూశాం.. అతని పేరు సచిన్ టెండూల్కర్. అప్పట్లో సెలక్టర్లు సచిన్ కోసం ఎక్కువ కాలం వేచి చూడలేదు, వెంటనే అవకాశం ఇచ్చారు. వైభవ్ విషయంలో కూడా అదే జరగాలి." అని ఆయన పేర్కొన్నారు.

ఫైనల్‌లో 'సూపర్ హ్యూమన్' ఇన్నింగ్స్
జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో వైభవ్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లను చీల్చిచెండాడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ ధాటికి భారత్ నిర్ణీత ఓవర్లలో 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆయుష్ మాత్రే నాయకత్వంలోని టీమిండియా ఈ లక్ష్యాన్ని కాపాడుకుని ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇది భారత్‌కు 6వ అండర్-19 ప్రపంచకప్ టైటిల్ కావడం గమనార్హం.
అప్పట్లో సచిన్.. ఇప్పుడు వైభవ్!
1989లో సచిన్ టెండూల్కర్ కేవలం 16 ఏళ్ల వయసులోనే పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌కు ఎంపికయ్యారు. అప్పట్లో వసీం అక్రమ్, వకార్ యూనిస్ వంటి దిగ్గజ బౌలర్లను ఎదుర్కొని సచిన్ తన సత్తా చాటారు. ఇప్పుడు వైభవ్ కూడా అదే తరహాలో చిన్న వయసులోనే అద్భుతమైన పరిణతి చూపిస్తున్నాడని, 2025 ఐపీఎల్ సీజన్‌లోనే తన ప్రతిభను ప్రపంచానికి చాటాడని శశి థరూర్ గుర్తు చేశారు.
విజేతలకు ఘనస్వాగతం.. రూ. 7.5 కోట్ల బహుమతి
ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి తిరిగొచ్చిన అండర్-19 జట్టుకు ఘనస్వాగతం లభించింది. కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీలను వారి సొంత ఊర్లలో హీరోల్లా ఊరేగించారు. జట్టు అద్భుత విజయానికి గుర్తుగా బీసీసీఐ (BCCI) రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఒత్తిడిలోనూ అజేయంగా నిలిచిన ఈ యువ జట్టును చూసి దేశం గర్విస్తోందని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా కొనియాడారు.












Click it and Unblock the Notifications