ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 5 లక్షల ఉచిత వైద్యం.. వాట్సాప్‌లోనే హెల్త్ కార్డ్
వాట్సాప్‌లో ఒక్క "Hi" మెసేజ్ పంపితే చాలు... ఏకంగా రూ. 5 లక్షల ఉచిత వైద్యం పొందే ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డ్ మీ చేతికి వచ్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ. 5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ వైద్య బీమా లభిస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న వేల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు, మందులు, ఆసుపత్రి వైద్య ఖర్చులన్నీ రూపాయి ఖర్చు లేకుండా పొందవచ్చు.
వయోవందన పథకం కింద
ముఖ్యంగా 70 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ఎలాంటి కుటుంబ ఆదాయ పరిమితి లేకుండా 'వయో వందన' కింద నేరుగా ఈ పథకం వర్తిస్తుంది. దీంతో పాటు తెల్ల రేషన్ కార్డు లేదా సామాజిక-ఆర్థిక డేటాలో పేరు ఉన్న పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలన్నీ ఈ ఉచిత ఆరోగ్య బీమాను పొందేందుకు పూర్తి అర్హులు. కుటుంబంలో ఉన్న సభ్యుల సంఖ్యపై ఎలాంటి పరిమితి లేదు. అంతేకాకుండా, ఈ ఒక్క కార్డ్‌తో సొంత రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఎక్కడైనా ఉచిత వైద్య సేవలు పొందవచ్చు. ఒకవేళ ఇంట్లో 70 ఏళ్లు దాటిన వృద్ధులు ఉంటే, వారికి కుటుంబ పరిమితితో సంబంధం లేకుండా అదనంగా మరో రూ. 5 లక్షల కార్డ్ ఉచితంగా ఇస్తారు.

హాయ్ అని మెసేజ్ పంపండి
ఇక ఈ హెల్త్ కార్డ్ కోసం మీసేవ కేంద్రాలు లేదా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరమే లేదు. మీ ఫోన్‌లో +91 72908 23838 నంబర్‌ను సేవ్ చేసుకొని, వాట్సాప్‌లో "Hi" అని మెసేజ్ పంపి, చాట్‌బాట్‌లో "My Ayushman Card" ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత ఆధార్ ఓటీపీ ద్వారా e-KYC పూర్తి చేస్తే ఆయుష్మాన్ కార్డ్ నేరుగా మీ వాట్సాప్‌లోనే డౌన్‌లోడ్ అవుతుంది. మీ సమీపంలో ఉచిత వైద్యం అందించే ఆసుపత్రుల వివరాలు తెలుసుకోవడానికి లేదా ఇతర సందేహాల కోసం ఉచిత టోల్ ఫ్రీ నంబర్ 14555 కు కాల్ చేయవచ్చు. అత్యవసర సమయంలో ప్రాణరక్షణగా, ఆర్థిక ఆసరాగా నిలిచే ఈ విలువైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్పకుండా షేర్ చేయండి.














Click it and Unblock the Notifications