Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?

Vishwanath and Sons Movie Review: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మమితా బైజు, రాధికా శరత్‌కుమార్ కాంబినేషన్లో డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించిన సినిమా 'విశ్వనాథ్ అండ్ సన్స్'. గజినిలో సంజయ్ రామస్వామిగా అలరించిన సూర్య.. ఈ చిత్రంలో సంజయ్ విశ్వనాథ్‌గా కనిపించారు. ఓ భిన్నమైన ప్రేమకథాంశంతో కూడిన ఈ క్లీన్ ఫ్యామిలీ డ్రామా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

ఆ అభిమాని అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదు? మౌనం వీడిన హీరో యశ్!
ఆ అభిమాని అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదు? మౌనం వీడిన హీరో యశ్!

స్టోరీ
40 ఏళ్ల సంజయ్ విశ్వనాథ్ (సూర్య) ఒక సంపన్న కుటుంబానికి చెందిన వారసుడు కావడంతో పాటు పెద్ద వ్యాపారవేత్త. అయినా కూడా షూటింగ్‌లో భారత్ తరఫున ఒలింపిక్స్ లో పాల్గొని బంగారు పతకం సాధిస్తాడు. పెళ్లిపై ఆసక్తి లేక సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతుంటాడు. కానీ అతడి తల్లి నిర్మలా దేవి (రాధికా శరత్‌కుమార్) గుండె శస్త్రచికిత్స సమయంలో వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు లేడనే బాధతో తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది. దాంతో అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఓ బాబును కని ఇంటికి తీసుకొస్తాడు. బాబు అనారోగ్యానికి గురైన సమయంలో కన్నతల్లి అవసరం ఏర్పడుతుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ సంజయ్ విశ్వనాథ్ అమెరికా వెళ్తాడు. 22 ఏళ్ల మదానకామేశ్వరి అలియాస్ మ్యాడీ (మమితా బైజు) వీరి జీవితంలోకి వస్తుంది. అసలు మ్యాడీ ఎవరు? సంజయ్‌కి పెళ్లి అంటే ఎందుకు ఇష్టం లేదు? అన్నదే మిగతా కథ.

Vishwanath and Sons Movie Review Suriya and Mamitha Baiju Shine in Family Drama Full Details

సినిమా ఎలా ఉందంటే?
డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ కొత్త కోణంలో ఫ్యామిలీ డ్రామాను రూపొందించారు. సినిమా ఫస్టాఫ్ చాలా సరదాగా, వినోదాత్మకంగా సాగిపోతుంది. సూర్య-మమితా బైజుల మధ్య కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్, రాధిక మార్క్ కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. చిన్నారి ఎంట్రీతో డైలాగ్స్ మరింత జీవాన్ని తెస్తాయి. ఇక సెకండాఫ్ లో కథ కాస్త వేగం తగ్గి తీవ్రమైన భావోద్వేగాల వైపు సాగుతుంది. ఫస్టాఫ్ లో ఉన్న కామెడీ లోపించడంతో పాటు స్టోరీ కొంతవరకు అంచనా వేసేలా మారుతుంది. వయస్సు వ్యత్యాసం, సరోగసీ వంటి అంశాలను సంక్లిష్టం చేయకుండా చూపించడంలో డైరెక్టర్ విజయం సాధించారు. రైతులకు ప్రాధాన్యత ఇవ్వడం, తల్లిదండ్రులను గౌరవించడం వంటి సామాజిక సందేశాలను చక్కగా జోడించారు. సీనియర్ నటి రాధిక నిర్మలా దేవి పాత్రలో ఎప్పటిలాగే తన అనుభవాన్ని చూపిస్తూ ఆకట్టుకున్నారు.

యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. ప్రముఖ నటి స్ట్రాంగ్ వార్నింగ్!
యశ్‌ను కర్ణాటకలో ఉండనివ్వం.. ప్రముఖ నటి స్ట్రాంగ్ వార్నింగ్!

ఫైనల్‌గా..
'విశ్వనాథ్ అండ్ సన్స్' కొన్ని లోపాలు ఉన్నప్పటికీ.. బంధాలు, అనుబంధాల ప్రాధాన్యతను చాటిచెప్పే మంచి ప్రయత్నం.

రేటింగ్: 3/5.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+