యష్ 'టాక్సిక్' ప్రివ్యూ షో టాక్: అతి వీర భయంకర హిట్..!
కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో రాకింగ్ స్టార్ యష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత 'టాక్సిక్' మూవీ చేశారు. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు.
ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26, 2026 తేదీన రిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమా రన్ టైమ్ ఇండియాలో ఒక రకంగా ఇంటర్నేషనల్ వెర్షన్ కు మరో రకంగా ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో 3 గంటల 15 నిమిషాలు ఉండగా దాన్ని 2 గంటల 54 నిమిషాలకు కుదించారు. ఇండియాలో ఈ సినిమా రన్ టైమ్ సుమారుగా 174 నిమిషాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ వెర్షన్ ను 3 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ వెర్షన్ మూవీని రికార్డు స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
పూర్తిగా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన 'టాక్సిక్' చిత్రాన్ని వెంకట్ కే. నారాయణ, యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమా రూపొందుతోంది. యష్, గీతూ మోహన్ దాస్ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఎంత భిన్నంగా ఉండబోతోందో ట్రైలర్ ను బట్టి చూస్తే ఇప్పటికే అర్థం అవుతోంది. ట్రైలర్ లోని కొన్ని సన్నివేశాలు చూస్తే.. యష్ పాత్రను పూర్తిగా విభిన్నమైన శైలిలో చూపించేందుకు దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది.

ఇక ఈ మూవీకి సంబంధించిన ప్రివ్యూ టాక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఒక భారతీయ సినిమాను చూసిన ఫీలింగ్ కలగదని చెబుతున్నారు. ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుందని మాట్లాడుకుంటున్నారు. యష్ ఈ మూవీలో ద్విపాత్రాభినయం చేశాడని.. అందులో ఓ పాత్ర విలన్ అని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో భయానక వైలెన్స్ సన్నివేశాలు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ మూవీ పెద్దవారికి మాత్రమేనని ఇప్పటికే చిత్ర నిర్మాత స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. టాక్సిక్ మూవీ ఫుల్ రివ్యూ కోసం ఆగస్టు 26 వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications