స్టార్ క్రికెటర్‌కు బిగ్ షాక్.. బెయిల్ నిరాకరించిన కోర్టు!

బెంగాల్ రంజీ క్రికెటర్, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున వికెట్ కీపర్-బ్యాటర్‌గా రాణిస్తున్న అభిషేక్ పోరెల్ చిక్కులు మరింత ముదిరాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక వేధింపులకు గురిచేశాడనే ఓ యువతి తీవ్ర ఆరోపణలపై అరెస్ట్ అయిన 23 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌కు చిన్సురా కోర్టులో బిగ్ షాక్ తగిలింది. అభిషేక్ పోరెల్‌కు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించిన న్యాయస్థానం.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?
Vishwanath and Sons Movie Review: సూర్య సినిమా హిట్టా? ఫట్టా?

అరెస్ట్ అనంతరం అభిషేక్ పోరెల్‌ను ఆగస్టు 11న స్థానిక కోర్టులో హాజరుపరచగా.. అతనికి మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది. అభిషేక్ పోరెల్ పోలీసు కస్టడీ గడువు ముగిసిన తర్వాత, సోమవారం అతడిని మళ్లీ కోర్టులో హాజరుపరచగా.. అతనికి జ్యుడిషియల్ కస్టడీ మంజూరు చేశారు.జూన్ 23వ తేదీ నుంచి కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఈ కేసు నమోదైంది. కర్ణాటకలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఓ యువతి అదే రోజు మొగ్రా పోలీస్ స్టేషన్‌లో అభిషేక్ పోరెల్‌పై ఫిర్యాదు చేసింది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. వారిద్దరూ సుమారు మూడున్నర సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. కలిసి విదేశాలకు కూడా ప్రయాణించారు. అయితే సుమారు 18 నెలల క్రితం వీరి మధ్య తీవ్రమైన వివాదాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లినప్పటికీ.. అప్పట్లో ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.

Delhi Capitals Cricketer Abhishek Porel Denied Bail Sent to 14-Day Judicial Custody Details

సదరు యువతి జూన్ 23న ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులు అభిషేక్ పోరెల్ చందన్నగర్‌లోని నివాసానికి పలుమార్లు వెళ్లినా అతను దొరకలేదు. దాంతో ఆ యువతి కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు.. అభిషేక్ పోరెల్ ను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని మొగ్రా పోలీసులను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. కోల్‌కతాలోని ఆయన నివాసంలో అతడిని అదుపులోకి తీసుకుని వివిధ క్రిమినల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

IND vs SL: భారత్-శ్రీలంక తొలి టెస్ట్.. జియో హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే?
IND vs SL: భారత్-శ్రీలంక తొలి టెస్ట్.. జియో హాట్‌స్టార్‌లో రాదు! ఫ్రీగా ఎలా చూడాలంటే?

అభిషేక్ పోరెల్ బెంగాల్ జట్టుకు రెగ్యులర్ ఆటగాడు, ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున కూడా ఆడాడు. అయితే ఈ సమయంలో ఈ న్యాయపరమైన విషయం అభిషేక్ పోరెల్ క్రికెట్‌కు ఓ పెద్ద సమస్యగా మారింది. తదుపరి విచారణ జరిగే వరకు అతడిని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు తాజాగా ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+