ఏకముఖ రుద్రాక్షమాలను ధరిస్తే..
ఏకముఖి రుద్రాక్ష మాల ప్రాముఖ్యాని, విశిష్టతను జ్యోతిష్కుడు వివరించారు. ఈ మాలను ధరిస్తే కలిగే లాభాల గురించి కూడా ఆయన వివరించారు.
ఏకముఖి రుద్రాక్షనే శివరుద్రాక్ష అంటారు. ప్రతిఒక్కరూ దీనినే ధరించవలయును దీనిని శివుని ప్రతిరూపముగా చూస్తారు. ఈ రుద్రాక్ష అసలైనది. దొరకుట చాలా దుర్లభము. ఏకముఖి రుద్రాక్ష వృక్షజాతి రత్నము ఈ రుద్రాక్షను పరమశివ స్వరూపముగా భావిస్తారు. ఈ రుద్రాక్షను సూర్యుని స్వరూపముగా పూజిస్తారు. దీనిధారణ వలన సూర్యగ్రహ అనుగ్రహప్రాప్తి పాత్రులగుదురు.
ఈ మాలధారణ వలన ఆధ్యాత్మిక శక్తులు వశమగును. ఆధ్యాత్మిక జీవితములో హిమాలయ శిఖరమంత ఎత్తు ఎదుగును. అరుదుగా లభించే అద్భుతమైన ఈ ఏకముఖిరుద్రాక్ష జీడిపపు ఆకారములో (అర్ధచంద్రా కారమువలె ఉండును) మంత్ర-తంత్ర ప్రయోగములు త్రిప్పికొట్టబడును.
ఆధ్యాత్మికాభివృద్ధి కనబడును. దీనిధారణ వలన పని మీద ఆసక్తి పెరుగును. మనస్సులో భక్తి కలుగును. ఈ మూలను ధరించినవారు ఆర్థికముగా అందరికంటే ముందంజలో వుండుదురు.

ఇది చాలా ఖరీదు దొరుకుట చాలా కష్టము ముఖ్యముగా రాజులు, పరిపాలకులు, నాయకులు ధరించి అత్యద్భుత ఫలితములు పొందుతున్నారు దీని ధారణ వలన సిరిసంపదలు కలుగును.
అంతేకాక ధరించిన వారు ఉన్నతి నొందుదురు. అన్ని రుద్రాక్షల కంటే సర్వోత్తమమైనది.
ఈ మాలధారణ చేయునప్పుడు రుద్రాక్ష మంత్రమును 11 మార్లు జపము చేయవలెను దీని ధారణవలన బ్రహ్మహత్యాదోషము తొలగును. అంతేగాక ఇంద్రియ నిగ్రహము కలుగుతుంది
ఈరుద్రాక్షధారణ టి.బి, మరియు ఆస్త్మాలాంటి మొండివ్యాధులను తగ్గిస్తుంది. అంతేగాక తలనొప్పి, కంటిసమస్య, లివర్ సమస్యలు తొలగుతాయి.












Click it and Unblock the Notifications