Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యజ్ఞోపవీతం: ఎందుకు ధరించాలి, విశిష్టత ఏమిటి?

డా. యం. ఎన్. చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి"గోల్డ్ మెడల్" , ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం. తార్నాక-హైదరాబాద్.

యజ్ఞోపవీతం పరమ పవిత్రం

వైదిక సంస్కారాలతో పరిచయం ఉన్న ప్రతిఒక్కరికీ యజ్ఞోపవీత మహిమ సుపరిచితమే.సంస్కృత పదమైన యజ్ఞోపవీతాన్ని తెలుగులో జంధ్యం అంటాం. కొంత మంది మగవారి మెడలో వేలాడుతూ ఉంటుంది. కానీ జంధ్యాన్ని ఎందుకు వేసుకుంటారో చాలా మందికి తెలియదు. దీన్ని ధరించిన వారు నిష్టతో వారి వారి ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను బట్టి ఉపనయన సంస్కారంలో వేస్తుంటారు. యజ్ఞోపవీతాన్ని బ్రహ్మసూత్రం అని కూడా అంటారు.

జంధ్యాన్ని ఎందుకు ధరించాలి

'సూచనాత్ బ్రహ్మతత్త్వస్య వేదతత్త్వస్య సూచనాత్‌తత్సూత్రము పవీ తత్వాత్ బ్రహ్మసూత్రమితి స్మృతమ్'బ్రహ్మతత్త్వాన్ని సూచించడానికి, వేదతత్త్వాన్ని సూచించడానికి బ్రహ్మసూత్రాన్ని(యజ్ఞోపవీతాన్ని) ధరించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

అదే ఉపవీతం.అంటే రక్షణ వస్త్రం.యజ్ఞోపవీతాన్ని,శిఖనూ తప్పనిసరిగా ధరించాలని స్మృతులు పేర్కొంటున్నాయి.

యజ్ఞోపవీతం పరమ పవిత్రమైనది.అది ప్రజాపతి అయిన బ్రహ్మతో కలిసి పుట్టిందని 'యజ్ఞోపవీతం పరమ పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్...' అనే మంత్రం చెబుతోంది.

యజ్ఞోపవీతం తంతువు సముదాయం యజ్ఞోపవీతాన్ని నవతంతువులతో అనగా తొమ్మిది దారపుపోగులతో నిర్మించాలి. ఒక్కొక్క తంతువునకు ఒక్కొక్క దేవత ఉంటాడని స్మృతుల కథనం.

ఓంకారో హోగ్నిశ్చ నాగశ్చ సోమః పితృప్రజాపతీవాయుః సూర్యశ్చ సర్వశ్చ తన్తుదేవా అమీ నవఓంకారః ప్రథమే తంతౌ ద్వితీయేహోగ్నిస్థథైవ చ తృతీయ నాగదైవత్యం చతుర్థే సోమదేవతా పంచమే పితృదైవత్యం షష్ఠేచైవ ప్రజాపతిఃసప్తమే మారుతశ్రీ్చవ అష్టమే సూర్య ఏవ చసర్వేదేవాస్తు నవమే ఇత్యేతాస్తంతు దేవతాః

అంటే 'మొదటి తంతువులో ఓంకారం, రెండవ తంతువులో అగ్నిదేవుడు, మూడవ తంతువులో నాగదేవత, నాలుగవ తంతువులో సోమదేవత, ఐదవ తంతువులో పితృదేవతలు, ఆరవ తంతువులో బ్రహ్మదేవుడు, ఏడవ తంతువులో వాయుదేవుడు, ఎనిమిదవ తంతువులో సూర్యుడు, తొమ్మిదవ తంతువులో మిగిలిన దేవతలందరూ ఉంటారని ఈ శ్లోకంలోని పరమార్థం.

'యజ్ఞోపవీతం' కేవలం తంతువుల సముదాయం మాత్రమే కాదని అదో తొంభైయారు విషయాలకు ప్రతీక అని సామవేదఛాందోగ్య పరిశిష్టం చెబుతోంది.

'తిథివారం చ నక్షత్రం తత్త్వవేదగుణాన్వితమ్‌కాలత్రయం చ మాసాశ్చ బ్రహ్మసూత్రం హి షణ్ణవమ్ 'ఈ శ్లోకంలో తాత్పర్యం ఇది. తిథులు 15, వారాలు 7, నక్షత్రాలు 27, తత్త్వాలు 25, వేదాలు 4, గుణాలు 3, కాలాలు 3, మాసాలు 12, మొత్తం 96. అంటే యజ్ఞోపవీతాన్ని ధరించిన వారికి తిథులలోనూ, వారాలలోనూ, నక్షత్రాలలోనూ, తత్త్వాలలోనూ, వేదాలలోనూ, గుణాలలోనూ, కాలాలలోనూ, మాసాలలోను పవిత్రత ఏర్పడి అవన్నీ ధరించిన వారికి శుభఫలాలను కలిగిస్తాయని అర్థం.

'యజ్ఞోపవీతం' తొంభైయారు కొలతలతో కూడి ఉండాలని 'వశిష్ఠస్మృతి' ప్రమాణంగా తెలియ జేసింది.' చతుర్వేదేషు గాయత్రీ చతిర్వింశతికాక్షరీతస్మాచ్చతుర్గుణం కృత్వా బ్రహ్మతంతుముదీరయేత్ 'నాలుగు వేదాల్లోనూ గాయత్రీ మంత్రం 24 అక్షరాలుగానే ఉపదేశించారు. ఆ మంత్రంలోని అక్షరాల సంఖ్యకు నాలుగింతలుగా అంటే (24X4=96) తొంభైయారు తంతువులుగా యజ్ఞోపవీతాన్ని నిర్మించుకుని ధరించాలని ఉపదేశం.గాయత్రీ మంత్రాన్ని స్వీకరించే సమయంలో ధరించేది యజ్ఞోపవీతం. గాయత్రీ మంత్రాక్షరాలకు నాలుగింతల సంఖ్యతో కూడిన తంతువులు ఉండాలని తాత్పర్యం.

పాటించాల్సిన నియమాలు

పాటించాల్సిన నియమాలు

యజ్ఞోపవీతాన్ని ఏ పరిమాణంలో తయారు చేసుకోవాలో సాముద్రిక శాస్త్రం చక్కగా ప్రబోధిస్తోంది.‘ పృష్ఠదేశే చ నాభ్యాం చ ధృతం యద్విందతే కటిమ్‌తద్ధార్యముపవీతం స్యాత్ నాతిలంబం నచోచ్చ్రితమ్ ఆయుర్హ రత్యతిహ్రస్వం అతిదీర్ఘం తపోహరమ్ యశో హరత్యతి స్థూలం అతి సూక్ష్మం ధనాపహమ్ ‘అంటే యజ్ఞోపవీతం నడుము వరకు మాత్రమే వేలాడుతుండాలి. దానికంటే పైన గానీ, కిందుగాగానీ ఉండడం మంచిది కాదు. మరీ చిన్నగా ఉంటే ఆయుష్షు తగ్గిపోతుంది. మరీ పొడవుగా ఉంటే చేసిన తపస్సు నశిస్తుంది. లావుగా ఉంటే కీర్తి అంతరిస్తుంది.

మరీ సన్నగా ఉంటే ధనం నష్టమౌతుంది.

ఇలా ధరించాలి

ఇలా ధరించాలి

బ్రహ్మచారి ఒక యజ్ఞోపవీతాన్నీ, గృహస్థుడు రెండు యజ్ఞోపవీతాలను ధరించాలి. ఉత్తరీయానికి ప్రత్యామ్నాయంగా అదనంగా మరో యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఆరు నెలలు కాగానే యజ్ఞోపవీతం జీర్ణమైపోతుంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి యజ్ఞోపవీతాన్ని ధరించి, పాతబడిన దానిని తొలగించాలి.ఉగాది,శ్రావణ పూర్ణిమ రోజు తప్పక మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని ధరించే సమయంలోనూ,తొలగించే సమయంలో నిర్ధిష్ట మంత్రాలను తప్పక పఠించాలి. మంత్ర పఠనం కాకుండా యజ్ఞోపవీత ధారణ, విసర్జనలు పనికిరావు.

అలా చేయకూడదు

అలా చేయకూడదు

అశౌచాలవల్ల "ఆప్తుల జనన, మరణ సమయాలలో, గ్రహణం పట్టి వదిలిన తర్వాత" ఇతర అమంగళాలు కలిగిన సందర్భాలలో విధిగా యజ్ఞోపవీతాలను మార్చుకోవాలి. యజ్ఞోపవీతాన్ని పరిహాసం కోసం వాడడం, ఇతర వస్తువులను కట్టి అపవిత్రం చెయ్యడం ఎంతమాత్రం పనికిరాదు. అలాచేస్తే సమస్త పాపాలు చుట్టుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే యజ్ఞోపవీతంలోని తంతువులన్నీ మన శరీరంలోని ప్రాణనాడులే! వాటిని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో,యజ్ఞోపవీత తంతువులను కూడా అంతే జాగ్రత్తతో సంరక్షించుకోవాలి.

అది ప్రదర్శన కోసం కాదు

అది ప్రదర్శన కోసం కాదు

యజ్ఞోపవీతం మనిషి శ్రేయస్సు కోసం ఉపయోగపడాలే కానీ ప్రదర్శన కోసం కాదు. హిందు సనాతన ధర్మాలను గౌరవిస్తూ పెద్దలు మన శ్రేయస్సు కోరి కొన్ని పద్ధతులను ఏర్పాటు చేయడం జరిగినది.ఆ అమూల్యమైన మానవ ప్రయోజనాలను ఆచరిస్తూ ధరించాలి.సాంప్రదాయంగా,ఆరోగ్య,ఆనందమయంగా జీవిద్దాం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+