ధర్మ సాధనానికి శరీరమే ఆధారం: పరుగులు తీసే మనస్సును ఆపాలంటే?
డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
మనిషి మనుగడకు శరీరమే ఆధారం. మనకు శరీరం లేకుండా మిగతా అవయవాలు,ఇంద్రియాలు ఉండలేవు.శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం అని పెద్దలు చెప్పారు.అంటే ధర్మ సాధనానికి శరీరమే ఆధారం.కాబట్టి మనిషిని గుర్తించడం శరీరమే ముఖ్యమైన అంశం.

ఈ శరీరానికి కొన్ని అవసరాలు,సుఖాలు ఉంటాయి.
వాటిని తృప్తి పరచడం కూడా మనిషి పని చేయడానికి మూలం అవుతుంది.
శరీరానికి తిండి కావాలి, నిద్ర కావాలి, దానికి
మైధునం కూడా కావాలి.ఈ అవసరాల సంతృప్తి పరచడం కొరకు మనిషి పని చేస్తాడు.ఇవి తక్కువ ఆలోచనలు అనడం పొరపాటు. ఒక్కో సారి శరీరానికి కీర్తి కూడా ఉంటుంది.దారాసింగ్ దేహం, భీమా శరీరం, కోర మీసం, అందాల జుట్టు, ఆడవారి అందాలు అన్నీ కీర్తినిచ్చేటివి.
వీటికి పోషణ కావాలి.ఇప్పటి భాషలో క్రీములు,పౌడర్లు,ఇంకా ఎన్నో ఇవన్నీ అవసరాలా? సౌకర్యాలా? వీటి విభజన నేను చేయను. శరీరంలో ఉండే పంచ కర్మేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకీ కూడా తృప్తి కావాలి.కంటికి, చెవికి, ముక్కుకు, జిహ్వకి, చర్మానికి కూడా సుఖం, సంతృప్తి అవసరం వాటిని పొందడానికి మనిషి కష్టపడాలి.
దీన్ని తక్కువ ఆలోచనలు అనడానికి లేదు.
కర్మేంద్రియాలకీ పని కావాలి. వ్యాయామం కావాలి, పోషణకు మర్ధనలు కావాలి.ఉపయుక్తంగా ఉంచుకోవడానికి సాధన కావాలి కదా ! ఇవన్నీ సాధారణ అవసరాలే.
అందం ఇనుమడిమడింపజేసే అనేక ప్రక్రియలకు ఎంతో ఖర్చు చేయాలి.
కేశాలంకరణలాంటి ఒక్కో విభజన కూడా ఒక శాస్త్రమే.వీటన్నింటిని శారీరక అవసరాలు అందాం.
వీటన్నింటి కోసం మనిషి పని చేయాల్సిందే.అయితే మనిషిలో మరో ముఖ్యమైన అంశం మనస్సు.ప్రాణాయామం , యోగాసనాలు ధృఢమైన శరీరం కోసమైతే అవసరమే. 'శరీర మాద్యం ఖలు ధర్మ సాధనం' వాటివల్ల ఏకాగ్రత, ఆరోగ్యం లభిస్తాయి.ఆరోగ్యకరమైన శరీరం లేనిదే సాధన కుదరదు. కానీ ఇవే సాధన కాదు.
సాధన అంటే ఆంతరంగిక సాధన. మన మనస్సుతో మనం కూర్చోవాలి. ఏ విధంగా? ఒక శిల్పి శిల్పం చెక్కడానికి తదేక దృష్టితో ఏ విధంగా నిష్ఠను కుదుర్చుకుంటాడో ఆ విధంగా మనస్సుపై శ్రద్ధ పెట్టాలి.దానికి పరికరాలు ఇంద్రియాలు.ఇంద్రియాలు భగవంతుడు మనకు అనుగ్రహించిన ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదాన్ని నిర్లక్ష్యంగా, హీనంగా చూడం కదా ! ఆ విధంగానే మన ఇంద్రియాలను, మన ఆలోచనలను, మన నడవడిని నిత్యం పరిశీలించుకుంటూ ఉండాలి.
ఉదాహరణకు శరీరానికి ఏ పదార్థము తింటే హాని కలుగుతుందో మనకు అనుభవం మీద తెలుస్తుంది.ఆ పదార్థం తినడం మానివేయాలి.అలాగే జగత్తులోని మిగిలిన పదార్థాలలో మనకు హానికరమైన వాటిని గుర్తించ గలగాలి.వాటి జోలికి పోకుండా నిత్యం మనలను మనం పరిరక్షించుకోవాలి.
తిరిగే ఫ్యానుని ఆపడానికి స్విచ్ నొక్కినట్లుగా పరుగులు తీసే మనస్సును ఆపడానికి ఒక్కటే మార్గం.
అదే శాస్త్ర శ్రవణం, సత్సంగం. శంకరులు కూడా 'సత్సంగత్వే నిస్సంగత్వం- నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలత్త్వం- నిశ్చలతత్వే జీవన్ముక్తిః" అన్నారు. సత్సంగంలో ఉన్నంతసేపు ధ్యానం, భజన, శ్రవణం, దైవదృష్టి, ఈ రకంగా జరుగుతూ ఉంటే క్రమంగా మానిసిక పరివర్తన పరిపక్వత వస్తుంది. అలా అలవాటు చేస్తే మనసు నెమ్మదిగా అంతర్ముఖమౌతుంది.ప్రశాంతతను పొంది స్వస్వరూపాన్ని గుర్తించగలుగుతుంది.
అందులకు మనస్సు, శరీరం ఏకతాటిపై ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!