నేను కూడా సీఎం..? సువేందు ప్రమాణం తర్వాతా వెనక్కి తగ్గని మమత..!

పశ్చిమ బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఇప్పటికీ దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి పాలైన తర్వాత కూడా సీఎం పదవికి రాజీనామా చేయకుండా, గవర్నర్ ను కలవకుండా దూరంగా ఉండిపోయిన మమతా బెనర్జీ.. ఇవాళ కొత్త సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం పూర్తయినా కూడా తన ధిక్కార స్వరం వినిపిస్తూనే ఉన్నారు.

రాజీనామా చేయను, కావాలంటే..! మమతా బెనర్జీ తాజా సవాల్..!
రాజీనామా చేయను, కావాలంటే..! మమతా బెనర్జీ తాజా సవాల్..!

ఇవాళ ఉదయం బెంగాల్ కొత్త సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటు పలువురు బీజేపీ, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా హాజరయ్యారు. అయితే సువేందు సీఎంగా ప్రమాణం చేయగానే మాజీ సీఎం మమతా బెనర్జీ తన ఎక్స్ ప్రొఫైల్ లో ఉన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదానికి మార్పులు చేశారు. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రికి బదులు మాజీ ముఖ్యమంత్రి అని మార్చేందుకు ఆమె ఇష్టపడలేదు.

Mamata Banerjee Won t Say Former CM Her X Bio Says It All
Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!
Mamata Banerjee: రాజీనామా చేయను..! మమత మరో బిగ్ షాక్..!

దీంతో ఆమె పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి (15వ, 16వ, 17వ అసెంబ్లీ) అని మాత్రమే మార్పు చేశారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ వ్యవస్థాపక ఛైర్ పర్సన్ అనే పదం కొనసాగించారు. వాస్తవానికి బెంగాల్లో ఓటమిపాలైన తర్వాత కూడా ఎక్స్ ప్రొఫైల్ ను మార్చకుండా మమత సీఎంగానే కొనసాగించడంపై ఇవాళ్టి వరకూ విమర్శలు వచ్చాయి. పలువురు యూజర్లు ఆమె బయోను మార్చాలని కోరుతూ ఎక్స్ ను, దాని యజమాని ఎలాన్ మస్క్‌ను కూడా ట్యాగ్ చేశారు, ఇంకొందరు అయితే మరో అడుగు ముందుకేసి మమతా బెనర్జీ ఎక్స్ ఖాతాను నిలిపివేయాలని కూడా డిమాండ్ చేశారు. చివరికి ఆమె సీఎం పేరు మాత్రం తీయడానికి ఇష్టపడలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+