ఫిబ్రవరిలో చతుర్గ్రాహి యోగంతో ఈ రాశులువారు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెల చాలా కీలకమైన నెల. ఈ నెలలో అనేక గ్రహాలు రాశి సంచారం చేస్తున్నాయి. ఈ ప్రభావంతో అనేక శుభ యోగాలు కూడా ఏర్పడుతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు కలిసి కుంభరాశిలో కలుసుకోనుండటంతో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది. జాతకంలో శుభస్థానంలో ఈ యోగం ఉంటే ఆ రాశిచక్ర గుర్తులకు తిరుగులేదు. భారీగా ధనలాభాన్ని పొందుతారని పండితులు తెలియజేస్తున్నారు.
వృశ్చిక రాశి
భారీ మొత్తంలో లాభాలు అందుకుంటారు. కొత్తగా వేసే ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. ఆస్తి కలిసివస్తుంది. అంతేకాకుండా జ్యోతిష్యులు చెబుతున్నదాని ప్రకారం ఈ సమయంలో ఈ రాశివారికి తిరుగులేదు. అన్నిరకాలుగా అదృష్టం కలిసిరాబోతోంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గతంలో కంటే ఇప్పుడు మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉంటారని, చేతిలో డబ్బులుంటాయని చెబుతున్నారు.

కుంభరాశి
వ్యాపారస్తులు భారీ మొత్తంలో ఆర్డర్లు పొందుతారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని భారీగా సంపాదిస్తారు. సమాజంలో హోదా పెరుగుతుంది. అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటర్వ్యూలకు వెళ్లేవారికి మంచి ప్యాకేజీ లభిస్తుంది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారు అద్భుతమైన విజయాలు సాధిస్తారని పండితులు తెలియజేస్తున్నారు. వీరు ఏ నిర్ణయం తీసుకున్నా తర్వాత వారికి కలిసివస్తుంది. అందరికీ అనుకూలమైన నిర్ణయం తీసుకోవడం అలవాటున్న ఈ రాశులవారు వారితోపాటు మరో పదిమందిని కూడా విజయతీరాలకు చేరుస్తారు.
మిథున రాశి
ఉద్యోగాల్లో ఉన్నవారికి వేతనం పెరగడంతోపాటు పదోన్నతులున్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వీరి గౌరవం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలను కుదుర్చుకుంటారు. కొత్తగా భాగస్వాములు తోడవుతారు. వీరినుంచి మద్దతు లభించి వ్యాపారాన్ని భారీగా విస్తరిస్తారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.












Click it and Unblock the Notifications