జనవరిలో త్రిగ్రాహి యోగంతో కొత్త సంవత్సరం కుబేరులు ఈ రాశులవారే
కొత్త సంవత్సరంలో జనవరి 13వ తేదీన సంపదకు కారకుడయ్యే శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. తర్వాత 14వ తేదీన సూర్య భగవానుడు, 16వ తేదీన కుజుడు.. ఇలా ఈ మూడు గ్రహాలు మకర రాశిలో కలుసుకోనుండటంతో త్రిగ్రాహి రాజయోగం ఏర్పడుతోంది. ఇది చాలా శక్తివంతమైన యోగం. దీనివల్ల కొన్ని రాశులవారు కలలో కూడా ఊహించని విధంగా అద్భుత లాభాలను దక్కించుకుంటారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఎవరికి కలిసివస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
ఈ రాశివారికి త్రిగ్రాహి రాజయోగం వల్ల ఊహించనిరీతిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అన్ని పనులు పూర్తిచేస్తారు. వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది. ఉన్నదాంతో సంతృప్తి పడతారు. డబ్బును పొదుపు చేస్తారు. ఊహించనిరీతిలో ధన ప్రయోజనాలు కలుగుతాయి. భవిష్యత్తు ఆదాయం పై దృష్టిసారిస్తారు.

ధనుస్సు రాశి
వీరికి ఆర్థిక పరిస్థితులు బలంగా మారతాయి. గతంలో కంటే ఇప్పుడు బలవంతులవుతారు. సంపాదన పెరుగుతుంది. ఉద్యోగులకు కెరీర్ పరంగా వస్తున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా గొప్ప గొప్ప అవకాశాలను పొందగలుగుతారు. వాటిని సద్వినియోగం చేసుకొని జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు.
మకర రాశి
వీరికి సంక్రాంతి నుంచి కొత్త జీవితం ప్రారంభమవుతుంది. పెళ్లి కానివారికి పెళ్లి కుదురుతుంది. పెళ్ళయినవారికి సంతాన యోగం ఉంది. ఆర్థికంగా వీరికి అనేక రకాలుగా లాభాలు కలగడంతోపాటు మంచి జీవితం ప్రారంభమవుతుంది. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేవారికి ఇది మంచి సమయం. పెద్దల సలహాలతో వీటిని ప్రారంభించాలి.
వృషభ రాశి
ఈ రాశివారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలోనే పూర్తవుతాయి. జీవితంలో మీరు అనుకున్నవనీ జరుగుతాయి. ఆర్థిక లాభాలున్నాయి. అంతేకాకుండా భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటారు.












Click it and Unblock the Notifications