రేపు ఇలా చేయండి.. అదృష్టం దరిద్రంలా పట్టుకుంటుంది
సెప్టెంబరు రెండోతేదీ సోమావతి అమావాస్య. ఆరోజు పితృదేవతలను ఆరాధిస్తే వారు ఎంతో సంతోషిస్తారు. ఆరోజు దానానికి, స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సోమావతి అమావాస్య రోజు కొన్ని వస్తువులను దానం చేస్తే మన పూర్వీకులు ఎంతో సంతోషిస్తారు. అంతేకాదు అవి అదృష్టాన్ని కలిగిస్తాయి. అమావాస్య రోజు చేసే మంచి పనులవల్ల లభించే పెద్దల ఆశీర్వాదాలు ఫలించి జనన మరణ చక్రాల నుంచి బయటపడేస్తాయి. పవిత్రమైన సోమవాతి అమావాస్య రోజు కొన్ని వస్తువులను దానం చేయడంవల్ల జన్మజన్మల పుణ్యం లభిస్తుంది.
రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి చెట్టుకు నీరు సమర్పించుకోవాలి. సాయంత్రం సమయంలో రావిచెట్టు కింద దీపం వెలిగించాలి. ఆరోజు శివారాధన మంచి ఫలితాన్నిస్తుంది.

ఉదయాన్నే నిద్ర లేచి పితృదేవతల పేరుతో దానం చేయడంతోపాటు రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. మహిళలు రావిచెట్టుకు 108 ప్రదక్షిణలు చేసి నూలు దారాన్ని చెట్టుకు కట్టి పూజిస్తారు.
పవిత్రమైన మత గ్రంథాలు రామాయం, భాగవతం, భగవద్గీత, ఉపనిషత్తుల్లాంటి గ్రంథాలను బహుమతిగా ఇస్తే ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది.
సోమవతి అమావాస్య రోజు నెయ్యిని దానమివ్వడంవల్ల ప్రశాంతత, పవిత్రత కలుగుతుంది. పవిత్రమైన ఆచార వ్యవహారాల్లో నెయ్యిని దైవానికి నైవేద్యంగా ఉపయోగిస్తారు. ఇది వెలకట్టలేని దానం వంటిది.
ఉప్పును కూడా దానమివ్వవచ్చు. దీనివల్ల మంచి జరగడంతోపాటు ఇచ్చిన దాతకు ఆధ్యాత్మికంగా మంచి పుణ్యాన్ని కలగజేస్తుంది.
దుప్పట్లు దానం చేయడంవల్ల చల్లటి వాతావరణంలో ఇబ్బందులు పడుతున్నవారికి ఉపశమనం కలిగించినట్లవుతుంది. భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది.
డబ్బును దానంగా ఇవ్వడం గొప్ప చర్య. పవిత్రమైన కార్యాలకు విరాళంగా ఇవ్వొచ్చు. దీనివల్ల సంతృప్తి కలుగుతుంది.
సోమావతి అమావాస్య రోజు అన్నదానం చేయడం అత్యంత పవిత్రమైన కార్యం. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడంవల్ల పెద్దల ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే గోధుమలు, బియ్యం వంటివి కూడా దానం చేయవచ్చు.
కొత్త వస్త్రాలు దానమిస్తే మంచిది. లేదంటే తక్కువగా వాడిన వస్త్రాలను కూడా దానం ఇవ్వొచ్చు. ఆధ్యాత్మికంగా ఎంతో పుణ్యాన్ని ఈ చర్యలు కలిగిస్తాయి.












Click it and Unblock the Notifications