వారఫలాలు: నిజాయితీగా ఉండాలి.. అదే మిమ్మల్ని రక్షిస్తుంటుంది
జ్యోతిష్య శాస్త్రంలో 12 రాశులు, 27 నక్షత్రాల గురించి పూర్తిగా చెబుతారు. నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాలు తమ రాశులను మారుస్తుంటాయి. ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు వివిధ రాశులవారి రాశిఫలాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం.
తులారాశి : ఉద్యోగస్తులు ఉన్నత స్థానాన్ని అలంకరిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధన ధాన్య లాభం ఉంది. శుభకార్యాలు జరుగుతాయి. మంచి ఆలోచనతో చేసే పనులు గుర్తింపునిస్తాయి. ఇతరులపై ఆధారపడొద్దు. విష్ణు సహస్రనామం అత్యంత శుభప్రదం.
వృశ్చిక రాశి : ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోవాలి. ప్రతి పనికి విఘ్నాలుంటాయి. అయినా ఓర్పుగా వ్యవహరించాలి. దేనికీ తొందరపడటం మంచిదికాదు. ముఖ్యమైన పనుల విషయంలో జాగరూకతగా ఉండాలి. ఈర్ష్యతో నిందులు వేసేవారుంటారు. అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు మౌనంగా ఉండటం మంచిది. ఇంట్లో వారికి చెప్పిన తర్వాతే ఏ పనినైనా చేయాలి. అపార్థాలకు తావు ఇవ్వొద్దు. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

ధనుస్సు రాశి : ప్రవర్తనవల్ల అందరినీ ఆకట్టుకుంటారు. విజయం సాధిస్తారు. గృహనిర్మాణానికి సంబంధించిన పనులు విజయవంతమవుతాయి. పిల్లలకు మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. బాగా శ్రమించాలి. ఏ నిర్ణయంలోను ఆలస్యం పనికిరాదు. కొత్త పనులు చేసే విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లక్ష్మీదేవిని ధ్యానించడంవల్ల శుభం చేకూరుతుంది.
మకర రాశి : ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలిస్తాయి. మంచి భవిష్యత్తుకు బాట వేసుకునేందుకు ఇదే మంచి సమయం. ఖర్చుల్ని తగ్గించాలి. వ్యాపారంలో మిశ్రమంగా ఉంటుంది. ఒంటరిగా దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. సమష్టి నిర్ణయాలు శక్తిని కలిగిస్తాయి. విష్ణువును ధ్యానించాలి. మంచి శుభవార్త వింటారు.
కుంభరాశి : వ్యాపార యోగం బాగుంది. ఏ పనిచేసేటప్పుడైనా వ్యతిరేకంగా ఆలోచించడం మానుకోవాలి. వెనక నుంచి ఆవేశపరిచేవారుంటారు.. కానీ శాంతంగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకుంటున్నా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకుంటుండాలి. మీ ప్రవర్తనవల్లే అందరినీ ఆకట్టుకుంటారు. అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. సుబ్రమణ్యస్వామిని స్మరించడంవల్ల మనోబలం సిద్ధిస్తుంది.
మీన రాశి : ఆశించిన ప్రతిఫలం అందుకుంటారు. ఉద్యోగంలో మంచి స్థానం ఉంది. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. నిజాయితీగా ఉండాలి.. అదే మిమ్మల్ని కాపాడుతుంది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఇంటికి సంబంధించిన పనులు నెరవేరుతాయి. భూమి, వాహన యోగాలున్నాయి. రుణ సమస్యలు ఉంటే అవి తొలగుతాయి. ఈశ్వరుణ్ని ఆరాధించడంవల్ల శక్తి వస్తుంది.












Click it and Unblock the Notifications