రాశి మారుస్తున్న గురువు.. ఈ రాశులపై కనక వర్షం

గ్రహాలన్నింటిలోకెల్లా పెద్దది బృహస్పతి. దేవతల గురువైన బృహస్పతి పేరును దీనికి పెట్టారు. జ్యోతిష్యం ప్రకారం ఇది చాలా శుభప్రదమైన గురువు. జ్ఞానం, వివాహం, సంతానం, సంపదకు కారకుడైన గురువు ఏడాదికి ఒకసారి తన రాశిని మారుస్తుంది. గతేడాది మేషరాశిలోకి ప్రవేశించిన బృహస్పతి ఏడాది తర్వాత వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ ఏడాది మే 1న ఇది జరుగుతుంది. దీనివల్ల కొందరి జీవితాల్లో వెలుగు రానున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.

మిథున రాశి: వీరికి అదృష్టం తోడుంటుంది. దాంపత్య జీవితంలోని సమస్యలు పరిష్కారమవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడంతోపాటు సామాజిక హోదా పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. విజయవంతమవుతుంది. కెరీర్ లో మంచి వృద్ధి ఉంది. శుభవార్తను వింటారు. బాధ్యతలు కూడా పెరుగుతాయి. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు.

Jupiter transit 2024 effect three zodiac signs are very lucky

వృషభ రాశి: ఈ రాశిలోకే గురువు ప్రవేశిస్తాడు. దీనివల్ల వృషభరాశివారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇల్లు లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనిని అనుకున్న సమయంలో పూర్తిచేయడంతోపాటు ఏ పని తలపెట్టినా విజయవంతమవుతారు. కష్టకాలంలో స్నేహితుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

సింహ రాశి: ఈరాశివారి ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా గతంకంటే ఎక్కువ బలపడతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు లాభపడతారు. విద్యారంగానికి మంచి మంచి ఫలితాలు సాధించడంతోపాటు చేసే పనికి ప్రశంసలు దక్కుతాయి. కెరీర్ బాగుంటుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+