ఫిబ్రవరిలో ఈ రాశులకు అఖండ సంపదను వీలునామా రాసిన బృహస్పతి
జ్యోతిష్యం ప్రకారం దేవతల గురువైన బృహస్పతి ఆధ్యాత్మికత ఒక్కటే కాకుండా సంతానం, పెళ్లి, జ్ఞానం కలగడానికి కారకుడు. గురుడి ఆశీస్సులుంటే ఆ వ్యక్తి జాతకం అవతలి ఒడ్డుకు ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చేరుతుంది. ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్న బృహస్పతి వల్ల ఐదు రాశులవారు ఆర్థికంగా లాభపడటంతోపాటు అనేకరకాల ప్రయోజనాలను పొందుతున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
కన్యా రాశి
ఉద్యోగస్తులకు కొత్తగా అవకాశాలు రావడం జరుగుతుంది. దీనివల్ల కెరీర్ లో మంచి వృద్ధి సాధిస్తారు. వ్యాపారస్తులకు ఆకస్మిక ధనలాభం ఉంది. మంచి లాభాలను గడిస్తారు. ప్రణాళిక ప్రకారం పనిచేస్తే వీరికి తిరుగుండదు. గురుడి ప్రత్యక్ష సంచారం వల్ల అదృష్టం కలిసివచ్చి అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. జీవితంలో సంతోషంగా ఉండి విజయాలను సాధిస్తారు.

వృశ్చిక రాశి
జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. ఇది మీ దాంపత్య జీవితాన్ని మధురంగా మారుస్తుంది. ఉద్యోగస్తులకు ఇతర ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. కెరీర్ చాలా బాగుంటుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. వీరు ఆర్థికంగా బలోపేతమవుతారు.
మకర రాశి
అంకితభావంతో పనిచేసి మంచి ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగస్తులకు వారి కార్యాలయంలో మంచి గౌరవాన్ని అందుకోవడంతోపాటు ప్రమోషన్ కూడా ఉంది. ఉద్యోగాల్లో ఉన్నవారు, కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లడానికి అవకాశాలున్నాయి. కష్టపడి పనిచేయడంవల్ల బృహస్పతి మీ జీవితాలను మార్చేవిధంగా నిర్ణయాలు తీసుకొని అవకాశాలు కల్పిస్తాడు.
మేష రాశి
ఆర్థికంగా బలపడతారు. వ్యక్తిగత జీవితం సంతోషంగా మారుతుంది. ఉద్యోగస్తులకు వేతనం పెంపుతోపాటు ప్రమోషన్ ఉంది. వీరికి అన్నీ శుభాలే కలుగుతాయి. సంపద పరంగా చాలా బలంగా తయారవుతారు. అహంకారం పెరగకుండా చూసుకోవాలి. అలా పెరిగితే బృహస్పతి అణచివేస్తాడు. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్త పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు.
వృషభ రాశి
అదృష్టం కలిసివస్తుంది. భాగస్వామిగా ఉండి వ్యాపారం చేసేవారికి మంచి లాభాలున్నాయి. కొత్తగా అనేక అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. కొత్త పనులు ప్రారంభించిన వెంటనే వాటిని పూర్తిచేయగలిగే సామర్థ్యం వీరి సొంతమవుతుంది. విద్యారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications