2016 సంవత్సరపు వార్షిక ఫలాలు
గోచార ఫలాలు చదివేవారికి గమనిక
గోచారంలో అంటే రాశిఫలాలో చెప్పే అంశాలు 25 శాతము 75 శాతం మీజాతకంలోని (ప్రభావం లేదా సోర్స్)నిబట్టి చూసుకోవాలి.ఉదాహరణకి వివాహం వంటి అంశాలు ఈసంవత్సరం జురుగుతాయని చెపితే అవి మీజాతకంలో వివహ భావానికి మాంగల్యదోషం,కుజదోషం వంటివి లేనిదిగా ,పాప గ్రహాల దశ నడవనిదై ఉండాలి ఒక వేళ అలా ఉంటే జాతకం చూసుకొని పరిహారాలుచేసుకోవాలి.
మేషం రాశివారు (అశ్విని4పాదాలూ,భరణి 4పాదాలూ,కృత్తిక1 వపాదము )
గురుచారఫలం జులైవరకు సింహంలో - మిక్కిలి అనుకూల స్థానం. ఐశ్వర్యము పొందుతారు, ధనలాభముకలుగుతుంది, కొత్తస్నేహితులను కలుసుకొంటారు, వ్యవహారం లేదా చేసే పనులలొ అనుకూలత ఏర్పడుతుంది, సౌఖ్యము పొందుతారు, బంధుజనుల ప్రోత్సాహము పొందుతారు, సజ్జనులస్నేహము పొందుతారు,తర్వాత కన్యారాశి సంచారం వలన షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధికలుగుతుంది, బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు.రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనసంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటు స్వల్ప అనుకూల ఫలితములు కూడా కలుగును. కేతువు చలనం ఏప్రిల్‌్ నుండి కుంభ రాశి సంచారం వలన లాభస్థానమందు వీరు ఉత్కృష్టమైన లాభాలను కల్పిస్తారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును.సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలనఅష్టమ శని తీవ్ర దోషఫలదాత, అపమృత్యు భయము, రోగబాధ, ధనవ్యయము, అతురత, బంధుక్లేశము, వ్యవహార చిక్కులు, కార్యనాశనము పశునాశనము, కుటుంబమునకు దూరమగుట, మిత్ర విరోధము, సంతాన సౌఖ్యలోపము మరెన్నొ కష్టనష్టములు కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి -సమస్యాయుతంగా ఉంటుంది, వివాహంకానివారికి - వ్యాపారులకి -కొంత మాత్రమే లాభం, విద్యార్థులకి -సంవత్సరంమొదటి సగం బాగా ఉంటుంది.విదేశాలకు వెళ్లేవారికి మంచి కాలం
వీరు చేయవలసిన పరిహారాలు -శని గురు కేతు పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు. అది చదవండి.
వృషభ రాశివారు (కృత్తిక 2,3,4 పాదాలూ ,రోహిణి 4పాదాలు, మృగశిర 1,2 పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలో- కష్ట నష్టములుకలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళనకలుగుతుంది, అవమానము ఏర్పడతాయి, ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చుపరిస్థితి ఏర్పడుతుంది, దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము.మాటవిలువ తగ్గుట జరుగును,తర్వాత కన్యారాశి సంచారం వలన సౌఖ్యము పొందుతారు, బంధుజనుల ప్రోత్సాహము పొందుతారు, సజ్జనులస్నేహము పొందుతారు, సంతానము కలలుగుటకు అవకాశం వుంది, రాజానుగ్రహము పెద్దలఅనుగ్రహం పొందుతారు, శుభ కార్యములు ఆచరించుట వంటి అనుకూల ఫలితములు, కలుగును. రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనబుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును. కేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశిసంచారం వలన దశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యం, సంతోషం, కష్టాలు తొలిగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది.సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలన ఏడవ రాశియందు శని సంచరించు స్థానమున రోగమును, దేశాంతర ప్రయాణమును, హృదయ మునకు కష్టము, గొప్పభీతిని, ద్రవ్యనాశనమును, హృదయ తాపమును, అలసట, భార్యాబిడ్డలకు అనారోగ్యము, వేదన కల్పించును.
మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి - మంచికాలం,ప్రమోషన్‌లు కూడా పొందుతారు. వివాహం కానివారికి - ఈ సంవత్సరం జరుగుతుంది వ్యాపారులకి - బాగుంటుంది,విద్యార్థులకి -శ్రమకి తగ్గఫలితం పొందలేరు,

వీరు చేయవలసిన పరిహారాలు
గురు రాహు పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
మిథున రాశివారు (మృగశిర 3,4 పాదాలు, ఆర్ద్ర 4పాదాలు ,పునర్వసు 1,2,3పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలోబంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము,తర్వాత కన్యారాశి సంచారం వలన కష్ట నష్టములుకలుగుతాయి, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఆందోళనకలుగుతుంది, అవమానము ఏర్పడతాయి, ధన నష్టము కలుగుతుంది, దూర ప్రాంతములకు వెళ్ళి వచ్చుపరిస్థితి ఏర్పడుతుంది, దైన్యత కలుగుతుంది, బుద్ధి నిలకడగా వుండదు, గౌరవానికి భంగము.మాటవిలువ తగ్గుట జరుగును. రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనతృతీయ స్థానములో శుభ ఫలదాతలు, కీర్తి, శరీర బలము, ప్రజల్లో మాటకు విలువ పెరగటం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటు భాతృద్వేషము కల్పిస్తాడు. కేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశి సంచారం వలన నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలన శని ఆరవరాశి యందు సంచరించు కాలమున ధనధాన్య అభివృద్ధి, బంధు మూలక సంతోషము, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుట, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, శత్రుక్షయము, సర్వతో ముఖాభివృద్ధి కలుగును. మొత్తానికి ఈ సంవత్సరంలో నరదృష్టి బాగా ఉంది
ఉద్యోగులకి - కిందటి సంవత్సరం కంటేకొంత నయమగును, వివాహంకానివారికి - తప్పక అగును, వ్యాపారులకి -అన్ని విధాలా బాగుంటుంది, విద్యార్థులకి - పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు
వీరు చేయవలసిన పరిహారాలు.
గురు పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు, విధులు, నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి. కర్కాటక రాశివారు (పునర్వసు 4 వపాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలోకార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులోఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వ సుఖములు కలుగుతాయి ,శత్రువులు తగ్గుతారు, అధికారపెరుగుతుంది ,ప్రమోషన్లు పొందటానికి అవకాశంవుంది,ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరము వస్తుంది,తర్వాత కన్యారాశి సంచారం వలన ఎక్కువ శ్రమచేయవలసి వస్తుంది, దారిద్య్రత కలుగుతుంది, ఖర్చు పెరుగుతుంది, బంధుజనులతో విరోధము ఏర్పడుతుంది, ఉన్నచోటు మార్పు జరుగుతుంది, చేసే పనులకు హాని జరుగుతుంది, అధికారం,గౌరవం తగ్గుతుంది, వ్యాపారంలో నష్టముఏర్పడుతుంది, అన్నిపనుల్లో అవాంతరములు కలుగుతాయి, మిత్రులకు దూరమౌతారు, స్థితి నాశము.రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలన కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును. కేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశి సంచారం వలన రాహుకేతువులు అష్టమ స్థానమందు మిక్కిలి ప్రతికూల ఫలదాతలు, అనారోగ్యం, ఆందోళన, క్రూరజంతు భయం, కార్యనాశనం, ప్రయాణాయాసము, ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలనశని పంచమ రాశి యందు చలించు సమయమున కార్యములు చెడుటజరుగుతుంది, మనస్తాపము కలుగును, దాయాదులతో వ్యాజ్యములు(న్యాయసంబంధ చర్చలు,గొడవలు జరుగుతాయి), హీన జాతి స్త్రీతో సంభోగించి దాని వలన పరితపించుట, సంతాన నష్టము కలుగుతుంది, వ్యవహారములలో భంగములు ఏర్పడతాయి, వ్యాజ్యములు(కోర్టు లావాదేవీలు), చిత్తభ్రమ కలుగుతుంది, సంసారమునకు దూరమగుట వంటి ప్రతికూల ఫలితములు కలుగును. మొత్తానికి ఈ సంవత్సరంలో నరదృష్టి బాగా ఉంది
ఉద్యోగులకి - మంచి ఉన్నతిని పొంది ప్రమోషన్‌లు కూడా పొందుతారు, వివాహంకానివారికి - వివాహం కష్టం మీద జరుగుఉ, వ్యాపారులకి - కొంత లాభమే, విద్యార్థులకి - మంచి ఫలితాలు పొందుతారు.
వీరు చేయవలసిన పరిహారాలు.
గురు శని పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
సింహం రాశివారు (మఖ 4పాదాలూ,పుబ్బ 4 పాదాలూ ,ఉత్తర 1 వపాదం)
గురుచారఫలం జులైవరకు సింహంలో శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములుచేస్తారు , అవమానం పొందుతారు, అధికారులకోపం పొందుతారు, అదృష్టం తగ్గుతుంది, ఉద్యోగం చేసేచోట గొడవలు తలెత్తుతాయి.తర్వాత కన్యారాశి సంచారం వలన కార్యదక్షత పెరుగుతుంది, సౌభాగ్యముసిద్ధించు సమయం, మనసులోఆనందము పొందుతారు, అన్నివిధాలా అభివృద్ధి పొందుతారు, సర్వసుఖములు కలుగుతాయి,శత్రువులు తగ్గుతారు, అధికారపెరుగుతుంది ,ప్రమోషన్లు పొందటానికి అవకాశంవుంది, ధర్మకార్యములు చేస్తారు, మాటకు గౌరము వస్తుంది. రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనగోచార రాహు కేతువులు ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును. కేతువు చలనం ఏప్రిల్ నుండి కుంభ రాశి సంచారం వలనఈ స్థానములో రాహు కేతువులు వ్యతిరేక ఫలదులు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధాన్యాదులు లభ్యమగును. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగును. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలన అర్ధాష్టమ శనిగా దోష ఫలదుడు. అనారోగ్యము కలుగుతుంది, మిత్రులను కోల్పోతారు, ధన నష్టము, భీతి కలుగుతుంది, మన:క్లేశము ఏర్పడుతుంది, ఉన్నచోటునుండి బ్రంశము ఏర్పడుతుంది, కళత్ర బంధు నస్టము, వాత వ్యాధులు కలుగుతాయి, బాధలు కలుగుతాయి, వృధా ప్రయాణములు చేస్తారు,శారీరక పుష్టితగ్గుతంది, మరెన్నో వ్యతిరేక ఫలితాలు కలుగును. మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి - తోటివారితో విరోధం,ప్రమోషన్‌లో ఆటంకాలుంటాయి.వివాహంకానివారికి -సెప్టెంబర్ తర్వాత జరుగును. వ్యాపారులకి -లాభనష్టాలు కలిసి ఉంటాయి. విద్యార్థులకి -చెడు వ్యసనాలచే విద్యపాడగును. అంతగా రాణించదు
వీరు చేయవలసిన పరిహారాలు.గురు శని పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
కన్య రాశివారు(ఉత్తర 2,3,4 పాదాలు ,హస్త 4 పాదాలూ ,చిత్త 1,2 పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలోఉన్నచోటునుండి వేరే చోటుకి వెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, దారిద్య్రత, దు:ఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్థినష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు. తర్వాత కన్యారాశి సంచారం వలన వ్యతిరేక ఫలప్రదము పొందుతారు. ధన నష్టము కలుగుతుంది, బంధువులతో విరోధముఏర్పడుతుంది, ఇంట్లో కల్లోలములు ఇబ్బందులు కలుగుతాయి, శత్రువులు పెరుగుతారు, చేసే పనులలో ఆతురత పెరుగుతుంది, చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి, బుద్ధి భ్రంశము కలుగుతుంది, ఇతరులతో విరోధములు ఏర్పడతాయి, దూర ప్రయాణములు చేస్తారు. రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలన12వ స్థానం చలనం అశుభ ఫలితములిచ్చును. దరిద్రము, ధన నాశనము, నేత్ర బాధలు, శత్రుభయము, అన్నికార్యములు విఘ్నముగుట, స్థాన చలనం, రావలసిన లాభాలకు ఆటంకము, అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. కేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశి సంచారం వలన రాహు, కేతువులు షష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, విక్రమము, సాహస కార్యనిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఎల్లప్పుడూ సుఖము, శత్రు వర్గము నుండి భూలాభము వంటి మంచి ఫలితాలనిస్తారు. సంవత్సరమంతా శని వృశ్చికరాశి సంచారం వలన శనికి ఇది అనుకూల స్థానము. స్త్రీ సంభోగము పొందుతారు, మనసులో సుఖభావన పొందుతారు, స్వంతబుద్ధిచే ప్రయత్నించిన కార్యములు సిద్ధించును, స్వంతచోట్ల గమనము, ఆరోగ్యము పొందుతారు, బుద్ధి బలము పెరుగుతుంది, ధన లాభము కలుగుతుంది, విజయమువంటి అనేక శుభ ఫలములు కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి -మిశ్రమ ఫలితం పెద్ద మార్పుండదు,అంత లాభం ఉండదు, వివాహం కానివారికి - సెప్టెంబర్ తర్వాత అయ్యే అవకాశం ఉంది, వ్యాపారులకి -కొంత నయం, విద్యార్థులకి - అస్సలు పరిస్థితి బాగా లేదు. అన్నింటిలోనూ నష్టపోతారు.
వీరు చేయవలసిన పరిహారాలు.గురు రాహు పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
తుల రాశివారు (చిత్త 3,4 పాదాలు, స్వాతి 4 పాదాలు,విశాఖ 1,2,3పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలో మిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలముఏర్పడుతుంది, శరీరంలోతేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయముకలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగ ంలో ఉన్నతి కలుగుతుంది ,గౌరము పొందుతారు , కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది,,తర్వాత కన్యారాశి సంచారం వలన ఉన్నచోటునుండి వేరే చోటుకివెళతారు, వృధా ప్రయాణములు చేస్తారు, దారిద్య్రత, దు:ఖము కలుగుతుంది, ధన నష్టము ఏర్పడుతుంది, ఆస్థినష్టము కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది పుణ్యకార్యాలకు ఖర్చుపెడతారు. రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనలాభస్థానమందు వీరు ఉత్కృష్టమైన లాభాలను కల్పిస్తారు. పశులాభం, ధనలాభం, నూతన వస్తు ప్రాప్తి, ఆహార సౌఖ్యం, పరిమళ ద్రవ్యాలు వంటి అనుకూల ఫలితాలు కలుగును. కేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశి సంచారం వలన సంతాన సౌఖ్యలోపము, మనశ్శాంతికి భంగము, పుత్రులతో విరోధము, భోజన సౌఖ్యలోపముతో పాటు స్వల్ప అనుకూల ఫలితములు కూడా కలుగును. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలనఏలినాటి శని సంచారమందు ఇది మూడవ రాశి చలన కాలం. శని రెండవ రాశి యందు చలించునపుడు కార్యములు నశించుట జరుగుతుంది, తలత్రిప్పుట, తన మనుష్యులతో విరోధము ఏర్పడుతుంది, పాపచింతనము చేస్తారు, కలుగుతాయి కష్టములు, ఆర్థిక నష్టములు కలుగుతాయి, కుటుంబ సభ్యులకు అపకారము జరుగుతుంది, ఇతరులతో ద్వేషము కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలో నరదృష్టి బాగా ఉంది
ఉద్యోగులకి - బాగుంది,ప్రమోషన్‌లు పొందుతారు. వివాహంకానివారికి - తప్పక అవుతుంది,వ్యాపారులకి - అన్నివిధాలా బాతుంటుంది.విద్యార్థులకి -శ్రమకి తగ్గ ఫలితం లభిస్తుంది.
వీరు చేయవలసిన పరిహారాలు.గురు శని పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
వృశ్చిక రాశివారు (విశాఖ 4వపాదం ,అనూరాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలో దోష ఫల స్థానము. వస్తువులు ,ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధనధాన్యములు నష్టమవుతాయ, స్నేహితులకు దూరమవుతారు, వృధాప్రయాణాలుచేస్తారు. ,తర్వాత కన్యారాశి సంచారం వలనమిక్కిలి అనుకూల స్థానం. సర్వతోముఖాభివృద్ధి, శారీరక మానసిక బలముఏర్పడుతుంది, శరీరంలోతేజస్సు పెరుగుతుంది, అన్నివిధాల జయముకలుగుతుంది, కుటుంబంలో అభివృద్ధి ఏర్పడుతుంది, సుఖము పొందుతారు, మంత్రసిద్ధి విశేషించి దేవతానుగ్రహం పొందుతారు, ఉద్యోగంలో ఉన్నతి కలుగుతుంది ,గౌరము పొందుతారు, కీర్తి కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది,రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనదశమ స్థానంలో వీరు శుభ ఫలదాతలు. శరీర సౌఖ్యము, భోజన సౌఖ్యం, సంతోషం, కష్టాలు తొలిగిపోవడం, కర్మసిద్ధి బలంగా ఉండటం, ఆనందం కలుగుతుంది. కేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశి సంచారం వలన బుద్ధిబలలోపం, అనవసర ప్రయాణములు, వాత వ్యాధులు, స్త్రీ కలహం, కార్యవిఘ్నం కలుగును. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలనఏలినాటి శనిలో ఇది రెండవ రాశి చలన కాలము. జన్మరాశిలో శనిగ్రహ చలనం తీవ్రదోష ఫలితాలనిస్తుంది. శరీరంలో తేజస్సుతగ్గటం,భయం, రోగంకలుగుతాయి, దు:ఖము పొందుతారు, బంధువులకు దూరమౌతారు, బంధువులతో శత్రుత్వము ఏర్పడతాయి, శ్రమకరమైన ప్రయాణాలు చేస్తారు, చేసేపనులలో అవరోధాలు ఏర్పడతాయి, తప్పుడు పనులుచేస్తారు, బుద్ధి చపలంగా మారుతుంది, రోగము వలన బాధకలుగుతుంది, హృదయము నందు వ్యాధి వంటి వ్యతిరేక ఫలములు కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి -కొంతమాత్రమే బాగుంటుంది, వివాహంకానివారికి -సెప్టెంబర్‌లో అవుతుంది, వ్యాపారులకి -కొంతమాత్రమే ఫలితం ఉంటుంది
వీరు చేయవలసిన పరిహారాలు.
గురు శని కేతు పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
ధను రాశివారు (మూల 4పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వపాదం)
గురుచారఫలం జులైవరకు సింహంలోమిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు,అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, క్తొవస్తువులు పొందుతారు,ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యముపొందుతారు.,తర్వాత కన్యారాశి సంచారం వలన దోష ఫల స్థానము. వస్తువులు ,ధనం నాశనమవుతాయి, మనసులో అతురత కలుగుతాయి, పై అధికారులతో వ్యతిరేకత పొందుతారు, సంతానానికి అనారోగ్యము కలుగుతుంది, మిత్రుల మూలంగా నష్టము ఏర్పడుతుంది, ధనధాన్యములు నష్టమవుతాయ, స్నేహితులకు దూరమవుతారు, వృధాప్రయాణాలుచేస్తారు. రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలన నవమ స్థానంలో రాహు కేతు చలనం ప్రతికూలమైనది. దురదృష్టము, ప్రయాణాలలో ఇబ్బందులు, పశు నష్టం ధనధాన్య నష్టం వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. కేతువు చలనం ఏప్రిల్ నుండి కుంభ రాశి సంచారం వలనతృతీయ స్థానములో శుభ ఫలదాతలు, కీర్తి, శరీర బలము, ప్రజల్లో మాటకు విలువ పెరగటం, ధనలాభము, సౌభాగ్యం వంటి అనుకూల ఫలితాలతో పాటు భాతృద్వేషము కల్పిస్తాడు. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వల్ల శని ద్వాదశ సంచారంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇది దీర్ఘకాల వ్యతిరేక ఫలితాలకు ఆరంభము, గౌరవ భంగము, కృషి నాశనము, మన:క్లేశము, గృహచ్ఛిద్రములు, నష్టము, దు:ఖము, దారిద్య్రము, భోజన సౌఖ్య భంగము, హేయమైన జీవనము, బంధుపీడ, శత్రు వృద్ధి, సంతాన అనారోగ్యం, కళత్ర విరోధము, వివాదములు వంటి దోష ఫలితాలు కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి -మంచి మార్పులుంటాయి, వివాహంకానివారికి - తప్పకుండా జరుగుతుంది, వ్యాపారులకి - మంచి లాభాలుపొందుతారు, విద్యార్థులకి - మంచి మార్కులు పొందుతారు.
వీరు చేయవలసిన పరిహారాలు.శని పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
మకర రాశివారు (ఉత్తరాషాఢ 2,3,4 పాదాలు, ధనిష్ఠ 1,2 పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలోవ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత ,ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలుచేస్తారు, అరిష్టముకలుగును, ధననష్టము జరుగుతుంది, దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి,తర్వాత కన్యారాశి సంచారం వలనమిక్కిలి అనుకూల స్థానం. సకలవిధ సౌభాగ్యసిద్ధి, గృహలాభము కలుగుతుంది, కుటుంబంలో సౌఖ్యము పొందుతారు,అన్నివిధాల అభివృద్ధి కలుగుతుంది, ఆచార జీవనము జీవిస్తారు, అనుకున్న పనులు సాధిస్తారు, క్తొవస్తువులు పొందుతారు,ధనలాభము కలుగుతుంది, మృష్టాన్న భోజనము చేస్తారు, స్త్రీ సౌఖ్యము పొందుతారు.రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనయం, కార్యనాశనం, ప్రయాణాయాసము, ప్రభుత్వ దండనా భయం, విచారం వంటి ప్రతికూల ఫలితములు కలుగును. కేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశి సంచారం వలన కలహం, మనస్తాపం, అపకీర్తి, ధన నష్టం, కష్టాలు కలుగును. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలన మిక్కిలి అనుకూల స్థానము, పుత్ర ప్రాప్తి, కళత్ర సౌఖ్యము, ధన లాభము, ఇష్టార్థ సిద్ధి, దేహారోగ్యము, అగౌవము, అధికార వృద్ధి, కుటుంబ సౌఖ్యము, నిర్మలమైన మనస్సు, అనేక విధాలైన లాభములు కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలోఉద్యోగులకి -ఆగస్టుతర్వాత బాగుంటుంది, వివాహంకానివారికి -సెప్టెంబర్ తర్వాత బాగుంటుంది, వ్యాపారులకి -బాగుంటుంది, విద్యార్థులకి -ఏరకంగానూ బాగాలలేదు
వీరు చేయవలసిన పరిహారాలు - రాహువు పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా నవగ్రహ పరిహారాలు ' అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
కుంభ రాశివారు (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
గురుచార ఫలం జులైవరకు సింహంలో శుభపలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం,సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను,గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును,తర్వాత కన్యారాశి సంచారం వలన వ్యతిరేక ఫలస్థానం. ఎక్కువ శ్రమచేస్తారు, రాజభయములేదా పై అధికారులచేత ,ప్రభుత్వంచేత భయం పొందుతారు, చేసే పనులలో ఆటంకములు కలుగుతాయి, గౌరవం తగ్గుతుంది, కష్టతరమైన నష్టప్రదమైన ప్రయాణాలు చేస్తారు, అరిష్టముకలుగును, ధననష్టము జరుగుతుంది, దేహకాంతి తగ్గుతుంది, దొంగల వల్ల భయము కలుగుతుంది, కష్టనష్టాలు కలుగుతాయి.రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలన గోచార రాహు కేతువులు ప్రతికూల ఫలదాతలు. దేశ సంచారము, కలహాలు, రోగము, నష్టము, ఇబ్బందులు, భార్యాపుత్రులతో విరోధము వంటి కష్టనష్టములు కలుగును. కేతువు చలనం ఏప్రిల్ నుండి కుంభ రాశి సంచారం వలనఈ స్థానములో రాహు కేతువులు వ్యతిరేక ఫలదులు. స్వల్ప అనుకూల ఫలితాలను కూడా ఇవ్వగలరు. వృధా ప్రయాణాలు, వ్యాధి, స్వల్ప ధాన్యాదులు లభ్యమగును. స్వల్ప కుటుంబ కలహాలు, అనాలోచిత చర్యలు కలుగును. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలన దశమ స్థాన శని సంచారము దోష ఫలదము, పాప కార్యాచరణ, వృత్తి నష్టము, కర్మ భ్రష్టత, పరితాపము, దు:ఖము, మానభంగము, విఘ్నములు, వ్యాకులత, ఆదాయ నష్టం, కీర్తి భంగము, ఉద్యోగమందు బాధలు వంటి కష్టనష్టములు కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి - ఆగస్టువరకు బాగుంటుంది, వివాహంకానివారికి -సెప్టెంబర్ తర్వాత బాగుంటుంది, వ్యాపారులకి-ఆగస్టు తర్వాత లాభాలు వస్తాయి,విద్యార్థులకి - మంచి మార్కులు పొందుతారు.
వీరు చేయవలసిన పరిహారాలు.గురు రాహు పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
మీన రాశివారు (పూర్వాభాద్ర 4వ పాదం,ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు)
గురుచారఫలం జులైవరకు సింహంలో షష్ఠ స్థాన స్థితి దోషఫలదము. వ్యాధి కలుగుతుంది బంధువులతో కలహము ఏర్పడుతుంది, మనసులో అతురత కలుగుతుంది, అధికమైన ఖర్చులుచేస్తారు, భయము కలుగుతుంది, సంసారసౌఖ్యం లోపిస్తుంది, అనవరసమైన శ్రమచేస్తారు.,తర్వాత కన్యారాశి సంచారం వలనశుభపలదుడు. అనుకున్నపనులు సాధిస్తారు, కుటుంబంలో ఆనందం,సౌఖ్యము కలుగుతుంది, ధనలాభము కలుగుతుంది, ఆరోగ్యము పొందుతారు, స్త్రీసౌఖ్యము కలుగుతుంది, సంతాన ప్రాప్తి కలుగుతుంది, పెద్దలను,గొప్పవారిని కలుసుకొంటారు, గౌరవము పొందుతారు, అలంకారవస్తువులు ప్రాప్తించును. రాహుచలనం ఏప్రిల్ నుండి సింహరాశిసంచారం వలనషష్ఠస్థాన చలన కాలమందు మిక్కిలి అనుకూల ఫలదాతలు, విక్రమము, సాహస కార్యనిర్వహణ, శత్రుక్షయము, తెలివిగా వ్యవహారములు చక్కబెట్టుట, ఎల్లప్పుడూ సుఖము, శత్రు వర్గము నుండి భూలాభము వంటి మంచి ఫలితాలనిస్తారుకేతువు చలనం ఏప్రిల్‌నుండి కుంభ రాశి సంచారం వలన12వ స్థానం చలనం అశుభ ఫలితములిచ్చును. దరిద్రము, ధన నాశనము, నేత్ర బాధలు, శత్రుభయము, అన్ని కార్యములు విఘ్నముగుట, స్థాన చలనం, రావలసిన లాభాలకు ఆటంకము, అనవసర ప్రయాణాలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. సంవత్సరమంతా శనివృశ్చికరాశి సంచారం వలన భాగ్యస్థానమందు శని సంచారము వ్యతిరేక ఫలితములు కల్పించును. దు:ఖము, శత్రుబాధ, భార్యాబిడ్డలకు కష్టములు, వృధా ప్రయాణములు,వ్యాధి,దారిద్య్రత, పితృ వర్గములకు అరిష్టము, కొన్ని సందర్భాలలో అల్పసుఖము, ధర్మ విజ్ఞత వంటి స్వల్ప అనుకూల ఫలదము కలుగును.
మొత్తానికి ఈ సంవత్సరంలో ఉద్యోగులకి - కిందటి సంవత్సరం కంటేకొంత నయమగును, వివాహంకానివారికి - తప్పక అగును, వ్యాపారులకి -అన్ని విధాలా బాగుంటుంది, విద్యార్థులకి - పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు
వీరు చేయవలసిన పరిహారాలు - శని పరిహారాలు చేసుకోండి,మీరు చేయవలసిన దానాలు పరిహారాలు పూజలు,విడిగా ' నవగ్రహ పరిహారాలు 'అనే ఆర్టికల్‌లో అందిచారు.అది చదవండి.
నవగ్రహాలకి జపాలు పరిహారాలు
/jyotishyam/feature/jyothisham-remedies-navagrahas-156609.html












Click it and Unblock the Notifications