జ్యోతిషం: మృగశిర నక్షత్రంలో జన్మిస్తే...
మృగశిర నక్షత్రంలో 3,4పాదాలు మిథునంలో ఉంటాయి. ఈ రాశికి అధిపతి బుధుడు మృగశిర కుజుని నక్షత్రం కనుక కుజ మహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. మృగశిర నక్షత్ర జాతకులకు ఉత్సాహం, ధైర్యసాహాసాలు, పాపభీతి, మాతృభక్తి, శాస్త్రవిజ్ఞానం, స్వాభిమానం, తీవ్రవిమర్శ, అవివేకం, ఉన్నత వక్షస్థలం, విశాలమైన భుజాలు ఉంటాయి. చపలత్వం అధికం, ఉత్సాహంగా పనులు నిర్వహిస్తారు. పెత్తనం వహించగలరు.
మొదటి పాదంలో పుట్టినవారు: సింహ నవాంశ, రాజాంశలో జన్మిస్తే భారీ కార్యక్రమాలు తలపెడతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కోపం, దర్పం అధికం, సంపన్నులవుతారు. కుటిల నీతి అవలంబిస్తారు.
రెండవ పాదంలో పుట్టినవారు: కన్యానవాంశ, చండీ రాశిలో జన్మించిన వారు వ్యవహారదక్షులు, కార్య సాధకులు, యుక్తిపరులు అవుతారు. సత్యవాదులు, దైవచింతన కలవారు అవుతారు. శాంతంగా నిదానంగా వ్యవహరిస్తారు.

మూడవ పాదంలో పుట్టినవారు: తులా నవాంశ అభియాఆంశలో జన్మించే మంచి రూపం, ప్రసన్నమైన ముఖం, దానగుణం, ఔదార్యం, కళాభిరుచి, స్నేహశీలం, జనాకర్షణ, త్యాగబుద్ధి, పరోపకారం ఉంటాయి. చేసిన మేలు మరువలేరు. మాటలలో మంచితనం కనిపిస్తుంది.
నాల్గవ పాదంలో పుట్టినవారు: వ్యసనలోలత, వివాదశీలం, కోపం ఉంటాయి. శత్రుద్వేషం, రోగ పౌరుసాలు, చపలత్వం ఎక్కువగా ఉంటాయి.












Click it and Unblock the Notifications