జాతకం: అశ్విని నక్షత్రంలో జన్మిస్తే....
అశ్విని నక్షత్రంలో జన్మిస్తే సాధారణంగా ఎక్కువకాలం జీవిస్తారు. అందంగా, ఆర్షణీయంగా ఉంటారు. అందరికీ ప్రేమపాత్రులై స్నేహభావంతో ప్రవర్తిస్తారు. నేర్పుతో పనులు నిర్వహిస్తారు. నగలు, ఆభరణాలమీద మక్కువ ఎక్కువ ఉంటుంది. ధైర్య సాహసాలు ఎక్కువ.
దుర్జన సాంగత్యం వల్ల కొన్ని చిక్కులు ఏర్పడతాయి. / చపలత్వం, లోభగుణం కొద్దిగా కనిపిస్తాయి. స్థూలశరీరం, దీర్ఘహస్తాలు, సూక్ష్మ నాసిక, విశాల నయనాలు, మంచి రూపం, కంటి ప్రదేశంలో మత్స్యరేఖలు ఉండవచ్చు. అయితే అవయవాల తీరు, గుణగణాలు నక్షత్ర పాదాలు, లగ్నం గ్రహస్థితిని బట్టి మారవచ్చు.
అశ్విని మొదటి పాదంలో పుట్టినవారి ప్రత్యేకలు: పొదుపరితనం, స్వల్పలోభం, ఆడంబారాలపై మోజు, భోగలాలస, స్త్రీ వ్యసనం, ధైర్యం, సాహసం, నిక్కచ్చితనం ఉంటాయి. స్వశక్తితో ఉన్నతస్థాయికి వస్తారు. కష్టాలను ఎదుర్కొని లక్ష్మం సాధిస్తారు. ధర్మం కోసం పోరాటం సాగిస్తారు.

రెండవ పాదంలో పుట్టిన వారు : శుక్రాంశలో జన్మిస్తే సంపద, తేజస్సు, ధర్మవర్తన దానగుణం ఉంటాయి. / మూడవ పాదంలో పుట్టిన వారు: బుధ ప్రభావం అధికం. మంచి చెడులను తెలుసుకొనే విచక్షణ, విమర్శనాదృష్టి, యుక్తి వాక్ చాతుర్యం, సాహసం అధికం. తర్కంలో, వాదనలలో, పోరాటాలలో విజయం సాధిస్తారు. విప్లవ రచనలు సాగిస్తారు. బోధకులు, వక్తలు కాగలరు. మంగళ, బుధ, వారాలు పగడం, ఆకుపచ్చ రాయి అనుకూలం. తమ శక్తి సమర్థంతోనే అభివృద్ధి పొందుతారు.
అశ్విని నాల్గవ పాదంలో పుట్టిన వారు: కుజ, చంద్రుల, ప్రభావం ఎక్కువ. ధర్మ ప్రవర్తన, పెద్దలపట్ల గౌరవాభిమానాలు, మంచి ఆలోచన, చపలత్వం, చక్కని నడవడి, ప్రేమాభిమానాలు, దేశభక్తి, నిర్వహణ సమర్థత ఉంటాయి.












Click it and Unblock the Notifications