• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

దీపారాధన - నియ‌మాలు

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిషులు , ఫోన్: 9440611151

మనం ఇంట్లో దేవునికి దీపారాధన చేసినా కొంత మంది విషయం తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి. దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అనే విషయంపై సరైన అవగాహన ఉండదు. అయితే నిత్యపూజకు ఎలాంటి ప్రమిదలు వాడాలి ? ప్రత్యేక పూజల సమయంలో ఎలాంటి దీపాలు వెలిగించాలి వంటి సందేహాలను ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.

పంచలోహాలు, వెండి, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయష్కరం. అయితే నిత్యపూజకు మట్టి ప్రమిదలు వాడటం మంచిది కాదు. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయడం మంగళకరం. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి మహాలక్ష్మి దేవిని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

jyothishyam, deeparadana, rules

తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. అదే ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరిసంపదలు, విద్య, వివాహం వంటివి సిద్ధిస్తాయి. దక్షిణంవైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు, కష్టాలు, దుఖం, బాధ కలుగుతాయి.

దీపారాధనకు తామరకాడతో చేసిన వత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. తెల్లటి కొత్త వస్ర్తం మీద పన్నీరు చల్లి ఎండలో ఆరబెట్టి తర్వాత ఆ వస్త్రాన్ని వత్తులుగా చేసి దీపారాధన చేసినా శుభ ఫలితాలు పొందవచ్చు. అలాగే జిల్లేడు కాయ నుంచి వచ్చిన దూదితో దీపం చేసి వెలిగిస్తే ఈతి భాదలు తొలగించు కునుటకు మంచిది .

దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలి అనే దానిపై చాలా మంది అయోమయం చెందుతూ ఉంటారు. ఎట్టి పరిస్థితులలో కూడా పల్లి (వేరుశనగ ) నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభము. అదే ఆవు నెయ్యి, విప్ప, వేప, ఆముదం, కొబ్బరినూనెల మిశ్రమంతో 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.

దీపాన్ని క్రింద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు,లేదా ఎదైనా ప్లేట్ ఉపయోగించి దీపారాదన చేయాలి.

English summary
Even though we are loyal to God in our house, we do not know some things and make some mistakes. Some other rules may not be known. Any lamp should light up the lamp. There is no proper understanding of what oil should be used for Deeparadhana. What should be used for eternal pooja? Let us clear the doubts as to the lighting of lights at special puja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X