• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాలసర్ప దోషం: కరోనా వైరస్ ఎప్పుడు అంతం అవుతుందంటే?

|

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

కరోన వైరస్ కి మూలకారణము కేతుగ్రహం. సూర్యుడు తులారాశి నుండి వృశ్చికరాశికి ప్రవేశించే కాలములో ఈ వైరెస్ జన్మించింది. అంటే సెప్టెంబరు, అక్టోబర్ కాలం తర్వాత జన్మించింది, కాని దాని యొక్క తీవ్రత మెల్ల మెల్లగా పెరిగింది.

కరోనా వైరస్ యొక్క తీవ్రత డిసెంబర్ 26 వ తేదీన షష్ఠగ్రహ కూటమి అనగా ఆరు గ్రహాలు గురువు , శని, కేతువు, సూర్యుడు, చంద్రుడు, బుధుడితో కూడుకున్నటువంటి ఆరుగ్రహాల కూటమి ధనుర్ రాశిలో ఏర్పడటము జరిగింది. ఈ షష్ఠగ్రహ కూటమి చాలా సర్వ సాధారణముగా ఎప్పుడు జరగదు. ఈ షష్ఠగ్రహ కూటమి వలన ఏర్పడిన విపత్తు ప్రపంచాన్ని అతలా కుతలం చేసింది. ఈ షష్ఠగ్రహ కూటమి ద్వార ఏర్పడిన వైరస్ క్రమముగా పెరుగుతూవచ్చింది. ఈ షష్టగ్రహ కూటమి నుండి చంద్రుడు త్వరగా బయటకు వెల్లడంతో ఆ తర్వాత పంచ గ్రహ కూటమిగా ఏర్పడింది.

డిసెంబర్ 31న మొదలై

డిసెంబర్ 31న మొదలై

డిసెంబర్ 31 వ తేదీన చైనా 'కరోన వైరెస్ మా దేశానికి వ్యాపించింద'ని మొట్ట మొదటి సారి ప్రపంచానికి తెలియచెప్పింది. ఆ రోజు గ్రహస్థితి రాహువు ఆరుద్ర నక్షత్రము మిథునరాశిలో ఉన్నాడు, చంద్రుడు కుంభంలో ఉన్నాడు, శుక్రుడు మకరములో ఉన్నాడు ధనస్సురాశిలో గురువు, శని, కేతువు, సూర్యుడు, బుధుడు ఐదు గ్రహాలు కలసి వున్నాయి. ఈ పంచ గ్రహ కూటమి డిసెంబర్ లో జరిగింది. జనవరి 11 వ తేదీన చైనా తన దేశములో కరోన వైరెస్ తో మరణము సంభవించిందని తెలియజేసింది.

కేతువు కలయిక వల్ల

కేతువు కలయిక వల్ల

జనవరి 23 వ తేదీన చంద్రుడు, బుధుడు, శని, సూర్యుడు ధనస్సురాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించారు. గురువు, కేతువు ధనస్సురాశిలో మిగిలి పోయాయి. ఈ గురువు, కేతువు కలయిక వలన ఈ వైరస్ ప్రపంచ వ్యాప్తమైపోయింది. గురువు శుభ గ్రహము అయినప్పటికి కేతువు కలయిక వలన ఈ వైరెస్ ప్రపంచమంతా విస్తరించింది. దీనితో పాటు శని, రవిల కలయిక వలన మృత్యు ప్రళయము మొదలైంది. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్ 19 అనే పేరుని సూచించింది. శని సూర్యులు శత్రు గ్రహాలు.

భారత్‌లో ప్రభావం ఎందుకు తక్కువంటే

భారత్‌లో ప్రభావం ఎందుకు తక్కువంటే

పిబ్రవరి 8 వ తేదీన కుజ, కేతు, గురు కలయిక వలన ఈ వైరెస్ ప్రపంచమంత పెను దుమారముగా ప్రబలి వ్యాప్తి చెందింది. గురువు, కేతువులతో కుజుడు కలవడము వలన కుజగ్రహ కలయిక ప్రభావముతో ప్రపంచమంతా భీభత్సముగా మారింది. పిబ్రవరి 18 వ తేదీ నుండి మార్చి 5 వ తేదీ మద్యలో రాహువు, కేతువు మధ్యలో సప్త గ్రహాలు ఉండడం వలన కాలసర్పదోషం ఏర్పడింది. మండుతున్న నిప్పులో ఆజ్యం పోసినట్టు అయింది. కాలసర్పస్థితి ప్రపంచమంతా ఏర్పడింది. ఈ మధ్యకాలములో మానవాళికి ఉపయోగపడే శుభగ్రహాలు వాటి శుభాత్వాన్ని కోల్పోయి, మంచిని చేసే గ్రహాలు కాలసర్పదోషము వలన శుభాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ ప్రభావము వలన ప్రపంచమంతా లాక్ డౌన్ ప్రకటించింది. జనజీవనము స్తంభించింది. భారతదేశము సనాతన సాంప్రదాయాలకు పుట్టినిల్లు అవ్వడం వలన దీని ప్రభావము తక్కువగా ఉంది.

మే నెలాఖరు వరకు కరోనా పరిస్థితులు

మే నెలాఖరు వరకు కరోనా పరిస్థితులు

ఈ యొక్క కరోన వైరెస్ జ్యోతిషశాస్త్ర ప్రకారంగా తగ్గుముఖం పట్టే పరిస్థితిని పరిశీలిస్తే ఈ ఉగాదినాటి గ్రహస్థితులు కాల సర్ప దోషాన్ని సూచిస్తున్నాయి కాబట్టి గ్రహ గతుల దృష్ట్యా వైరస్ ప్రభావం అనేది 'మే' నెలాఖరు వరకు ఉంటుంది. తర్వాత దీని ప్రభావం భాతరదేశంలో తగ్గు ముఖం పడుతుంది. కొన్ని గ్రహాలూ, ఉపగ్రహాలు అనుకూలంగా లేకపోవడం, వాటి సంచార స్థితి కుడా అనుకూలంగా లేకపోవడం వలన ఇంత సమయం పడుతుంది.

* ప్రస్తుత గ్రహ ప్రభావంతో ప్రజలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటారు.

* అడవులలో, జన వాసాలో అగ్ని ప్రమాదాలు, పశువుల ఆక్రందనలు సూచిస్తున్నాయి.

* భూకంపల సూచనలు ఉన్నాయి.

* నకిలీ ఆహార పదార్ధాలు, దోపిడిలు, దొంగతనాలు ఎక్కువౌతాయి, తస్మాత్ జాగ్రత్త .

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలను అప్రమర్ధంగా చూసుకునే బాధ్యత మరింత పెరుగుతుంది.

* ప్రభుత్వం అప్రమర్తతతో ఉండాలి, మతపరమైన విభేదాలు, అల్లర్లు చెలరేగే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది .

* ఆర్ధిక మాంద్యం విపరీతంగా స్వైర విహారం చేయటంతో పాలకులు పైకి గంభీరంగా కనిపించిన లో లోపల చాలా మధన పడే పరిస్థితి ఏర్పడుతుంది.

English summary
Kall Sarp Dosh: When Coronavirus will end world wide question is in crores of people. Reports suggest, Coronavirus impact will continue till May end.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more