కార్తీకమాసంలో దీపారాధనకు ఏ నూనె ఎంత శ్రేష్ఠం

దీపావళి, కార్తీకమాసం అనగానే మన ఇళ్ల ముంగిట కాంతులు విరజిమ్మే ప్రమిదలు, దివ్యమైన వెలుగులు గుర్తుకొస్తాయి. చీకటిని పారద్రోలుతూ ఆధ్యాత్మిక కాంతిని నింపే ఈ దీపోత్సవంలో ప్రమిదలు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. మన సంప్రదాయంలో దీపారాధనకు ప్రత్యేక ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రాముఖ్యత సైతం ఉంది. దీపంలో వాడే నూనె లేదా నెయ్యి రకాన్ని బట్టి ఆయా గృహాల్లోకి సానుకూల శక్తి, ప్రశాంతత, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తాయని పండితులు చెబుతుంటారు.

శాస్త్రాల ప్రకారం ప్రమిదలో వాడే నూనె.. మనలో ఉండే అజ్ఞానం, అహంకారం, ఈర్ష్య వంటి ప్రతికూల భావనలకు అద్దం పడుతుంది. దీపజ్యోతి దైవిక జ్ఞానానికి, పవిత్రతకు ప్రతీకగా నిలుస్తుంది. ప్రమిదలో నూనె కరిగిపోతూ వెలుగును పంచినట్లే, భక్తిభావంతో మనలోని దుర్గుణాలను దహనం చేసుకుని జ్ఞానకాంతిని పొందడమే ఈ దీపారాధనలోని ప్రధాన అంతరార్థం. అందుకే దీపావళి పూజలో ఉపయోగించే నూనె ఎంపికకు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు.

Karthika Masam vibration and energy gives that lighting lamp and oil influences prosperity peace

దీపారాధనలో ఆవు నెయ్యిని అత్యంత పవిత్రమైనదిగా, సాత్విక గుణ సంపన్నమైనదిగా భావిస్తారు. దీపావళి ధనత్రయోదశి, లక్ష్మీపూజ సమయంలో నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ఇంట దైవిక వాతావరణం పెరిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మరోవైపు నువ్వుల నూనెకు విశిష్ట శక్తి ఉంటుంది. జ్యోతిష్య పరంగా నువ్వుల నూనె శనిదేవుడికి ప్రీతిపాత్రమైనది. యమదీపం రోజున దక్షిణ దిశగా నువ్వుల నూనెతో ప్రమిద వెలిగించడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభించడమే కాకుండా అపమృత్యు భయాలు తొలగుతాయి.

కార్తీకమాసం మొదటి సోమవారం ఎప్పుడు
కార్తీకమాసం మొదటి సోమవారం ఎప్పుడు

కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో కొబ్బరి నూనెతో ప్రమిదలు వెలిగించే సంప్రదాయం ఉంది. కొబ్బరి నూనె మనస్సుకు శాంతిని, కుటుంబంలో సామరస్యాన్ని నింపుతుంది. ఆవ నూనెతో దీపాలు వెలిగించడం సానుకూల శక్తులను ఇంట్లోకి ఆహ్వానించినట్టవుతుంది. ఇంటి సింహ ద్వారాలు, కాంపౌండ్ వాల్, ఖాళీ ఆవరణలలో ఆవ నూనె దీపాలు ఉంచడం వల్ల చెడు దృష్టి, దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుందని విశ్వసిస్తారు.

సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!
సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగాలకు కార్తీకమాసం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

పండగలు, కొన్ని విశేష సందర్భాల్లో పంచదీప నూనెను ఉపయోగించడం అత్యంత శుభదాయకంగా పరిగణిస్తారు. నువ్వులు, కొబ్బరి, ఆముదం, విప్ప, వేప నూనెలను నిర్దుష్ట నిష్పత్తిలో కలిపి ఈ నూనెను తయారుచేస్తారు. ఇది ప్రకృతిలోని పంచభూతాల శక్తిని సమతుల్యం చేస్తుందిది. ఈ నూనెతో వెలిగించిన దీపం దీర్ఘకాలం పాటు ప్రకాశవంతంగా వెలుగుతూ ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుంది. పర్యావరణ స్పృహ ఉన్నవారు ఈ రోజుల్లో ఆర్గానిక్ నూనెలను కూడా ఎంచుకుంటున్నారు.

తిరుమల అన్నప్రసాద కేంద్రం, లగేజీ కౌంటర్ల వద్ద ఇకపై కొత్తగా.. !!
తిరుమల అన్నప్రసాద కేంద్రం, లగేజీ కౌంటర్ల వద్ద ఇకపై కొత్తగా.. !!

కార్తీకమాసంలో దీపారాధనకు సరైన నూనెలను ఎంచుకోవడం వల్ల పరిపూర్ణ ఫలితాలు అందుతాయి. లక్ష్మీదేవి పూజా పీఠం వద్ద ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె దీపాలను ఉంచడం శ్రేయస్కరం. ఇంటి ప్రాంగణం, ముఖ ద్వారం, ప్రధాన గేట్ వద్ద ఆవ నూనె లేదా నువ్వుల నూనె ప్రమిదలను అమర్చవచ్చు. పంచదీప నూనెతో దీపాన్ని వెలిగించి ఇంటి మధ్య భాగంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగి ఇల్లు కాంతిమయంగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+