కాశీలో జ్యోతిర్లింగాల్ని తాకాలంటే.. డ్రెస్ కోడ్ ఇదే..
కాశీలో ప్రవేశించగానే ముందుగా కాశీ విశ్వేశ్వరుని తలచుకుని, నమస్కరించుకుని కాశీ నేలని తాకి నమస్కరించుకోవాలి. బస చేరుకున్న తరువాత ముందుగా గంగా దర్శనం గంగా స్నానం. ఆ తర్వాత కాలభైరవుని దర్శనం కాలభైరవుని గుడి వెనకాల దండపాణి గుడి దర్శనం డుంఠి గణపతి దర్శనం చేసుకోవాలి. కాశీ విశ్వేశ్వరుని దర్శనం ఉదయం 4 గంటల నుండి 8 వరకు తిరిగి రాత్రి 7 :30 కు స్పర్శ దర్శనం ఉంటుంది. భక్తులు దర్శనానికి వచ్చే దాన్ని బట్టి టైం మారుతుంటుంది.
అన్నపూర్ణ దర్శనం భాస్కరాచార్య ప్రతిష్ఠిత శ్రీచక్ర లింగ దర్శనం. అన్నపూర్ణ దేవాలయ ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు ఉంటుంది.కాశీ విశాలాక్షి దర్శనం, వారాహి మాత గుడి ఈ గుడి ఉదయం 8-00 గంటల వరకే తెరిచి ఉంటుంది. ఇక్కడికి లలిత ఘాట్ నుండి వెళ్ళవచ్చు. లేదా విశాలాక్షి మాత గుడి వెనుకగా వారాహి మాత గుడికి అడ్డ దారి ఉన్నది ఇది చాలా దగ్గర దారి. ఎవరిని అడిగినా చెపుతారు.
మణికర్ణికా ఘట్టంలో వీలైతే స్నానం. మధ్యాహ్నం 12-00 గంటలకి గంగా హారతి, దశాశ్వమేధ్ ఘాట్ వద్ద , అస్సి ఘాట్ వద్ద కూడా గంగా హారతి ఇస్తారు. కేదార్ఘాట్ వద్ద కేదారేశ్వరుని దర్శనం. చింతామణి గణపతి దర్శనం, అస్సి ఘాట్ వద్ద ఉన్న లోలార్క కుండం లో స్నానం లేక ప్రోక్షణ లోలార్కఈశ్వరుని దర్శనం. దుర్గా మందిరము, గవ్వలమ్మ గుడి, తులసీ మానస మందిరము,సంకట మోచన హనుమాన్ మందిరం. తులసీ దాసుకు ఆంజనేయ స్వామి దర్శనం అయిన స్థలం. తిలాభాండేశ్వర దర్శనం
వీలైతే సారనాధ్ స్థూపం బుద్ధ మందిరం ఇది కొంత దూరంగా ఉంటుంది. ప్రత్యేకంగా వెళ్ళాలి. ఇది బట్టల షాపింగ్ సెంటర్.

గంగా నదీ ఘట్టాల దర్శనం అస్సి ఘాట్ నుండి మొదలు పెడితే వరుణ నదీ సంగమం వద్ద ఉన్న ఆదికేశవ్ మందిరం దాకా వెళ్ళవచ్చు. ఆదికేశవ స్వామి దర్శనం చేసుకోవాలి. ఇదే విష్ణు మూర్తి ప్రథమంగా భూమి పై అవతరించిన చోటు. గుడిలోకి వెళ్లి వస్తామని బోటు అతనితో ముందే మాట్లాడుకోవాలి. లేకపోతె నదిలో నుంచే చూపించి వెనక్కి తిప్పుతారు.
బిందు మాధవుని గుడి ఇది పంచగంగ ఘాట్ వద్ద ఉన్న ఔరంగజేబు కోటకి దగ్గరలో ఉంటుంది. ఓంకాళేశ్వర దర్శనం మెయిన్ రోడ్ నుండి కాల భైరవ స్వామి గుడి వైపు కాకుండా ఎడమవైపు రోడ్ లో వెళ్ళాలి. రిక్షా అయితే మంచిది. ఇవి రెండు మందిరాలు, ఉకారేశ్వరుడు మకారేశ్వరుడు చిన్నగా ఉంటాయి కానీ ఇవి రెండూ కూడా స్వయంభూ లింగాలు. కృత్తివాసేశ్వర లింగం -
ఓంకాళేశ్వర స్వామి దర్శనం అయిన తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే కృత్తివాసేశ్వర లింగం వస్తుంది. ఇది అన్ని కాలలలోను చల్లగా ఉంటుంది. స్వయంభూ లింగం. కృత్తివాసేశ్వర లింగం దర్శనం అయినా తరువాత ఇంకా కొంచం ముందుకు వెళ్ళితే మహా మృత్యుంజయలింగం దర్షించుకోవాలి. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు అక్కడి నూతన విశ్వనాథ, దుర్గా లక్ష్మి నారాయణ గుడి సముదాయం ఉంటుంది.
కాశీలో డ్రెస్ కోడ్ నియమం:- నూతన నిబంధనలు అమలు పరచిన వారణాసి ఆలయం. ప్రసిద్ధ కాశీ పుణ్యక్షేత్రంలో జ్యోతిర్లింగాల్ని తాకాలంటే ఇకపై సంప్రదాయ దుస్తులు ధరించాల్సిందే. గర్భగుడిలోకి వచ్చే భక్తులకు డ్రెస్‌కోడ్ అమలు చేయాలని వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం నిర్ణయించింది. జ్యోతిర్లింగం స్పర్శ దర్శనం చేసుకోవాలంటే పురుషులు తప్పనిసరిగా ధోతీ - కుర్తా, మహిళలు చీర ధరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్యాంట్, షర్ట్, జీన్స్, టీషర్ట్ లాంటి మోడ్రన్ దుస్తులు ధరించి వచ్చే భక్తులు దూరం నుండి మాత్రమే విశ్వేశ్వరుడిని దర్శించుకునే వీలుంటుందని, వారిని గర్భగుడిలోకి అనుమతించబోమని ఆలయ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications