గృహంలో ఆయా దిక్కుల్లో వాస్తు సమస్యలుంటే ఎలా అధిగమించాలి..?

డా. ఎం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151

గృహవాస్తు సమస్యలకు పరిస్కారములు:-

ఈశాన్యలో లోపాలు ఉంటే ఆ ఇంటి యజమాని తోడిమితో ఉన్న కొబ్బరిబొండాన్ని సోమవారం రోజున తెచ్చి పసుపు, కుంకుమలతో అలంకరించి పూజా మందిరంలో 3 రోజులు ధూప, దీప, నైవేద్యములు అర్పించి 4 వ రోజు గురువారంనాడు జనపనార ఉట్టి నందు కొబ్బరిబొండాన్ని ఉంచి ఉదయం సూర్యోదయం అయిన గంటలోపులో సింహద్వారముపై వ్రేలాడగట్టండి. ఈ తంత్రం చేసిన తర్వాత నుండి ఆ గృహములో నివసించే సర్వులు సుఖ సౌఖ్యాలు పొందుటకు చక్కని పరిష్కార మార్గం అని మన పెద్దలు అంటుంటారు.

ఆగ్నేయలో లోపాలు ఉంటే కుటుంబంలో ఇంటి ఇల్లాలికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కుటుంబ సభ్యులు అనేక రకాలుగా బాధపడుతూ ఉంటే యజమాని గుప్పెడు అలచందలూ, గుప్పెడు బియ్యం, కోద్దిగా కర్పూర మిశ్రములను ఆకాశ నీలిరంగు వస్త్రములో మూటగా కట్టి శుక్రవారం రోజున సింహద్వారంపై వ్రేలాడకట్టండి. లోపల దోషాలు హరించటమేకాక ఆరోగ్య, ఐశ్వర్యములతో నివసించెందుకు ఈ చిట్కా ఉపయోగపడుతున్నది.

Know the solutions to various vastu problems occuring in day to day life

వాయువ్యలో లోపాలు ఉంటే యజమాని చేతితో గుప్పుడు ఉలవలు, గుప్పేడు బియ్యం, పచ్చకర్పూర మిశ్రమంతో రంగు రంగుల వస్త్రంలో మూటగా కట్టి సింహద్వారంపై సొమవారం రోజున తగిలించండి. వాస్తు లోపాలు హరించి సుఖశాంతులు పొందుటకు ఉపకరిస్తుంది.

నైఋతిలో లోపాలు ఉండి సమస్యలతో సతమతమవుతూ తరచూ ప్రమాదాలకు గురి అవుచున్నవారు యజమాని చేతితో గుప్పెడు మినుములు, గుప్పెడు బియ్యం, సీసపుపాత్ర , తెనేరంగు లేదా బంగారపు రంగు పట్టువస్త్రంలో మూటగా కట్టి సింహద్వారంపై ఆదివారం రోజున వ్రేలాడగట్టితే వాస్తుదోషాలు హరించి సర్వత్రాజయము, సుఖము పొందగలరు .

Know the solutions to various vastu problems occuring in day to day life

పై విధంగా చేసుకుంటూ ఇంటికి ఈశాన్య ,ఆగ్నేయ, వాయవ్య, నైఋతి విదిక్కులలో వాస్తు లోపాలు ఉన్న సమస్యల నుండి బయటపడవచ్చు ఇవి చేసినా కూడా సమస్యలు ఇంకా ఉన్నట్లయితే వెంటనే మంచి అనుభవం ఉన్న వాస్తు సిద్ధాంతిని సంప్రదించండి, ఒక సారి మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా పరిశీలింపజేసుకోండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+