Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లక్ష్మి దేవి అనుగ్రహం ఎలా పొందాలి?.. వ్యసనాలతో ఆర్థిక నష్టాలేనా..

ఆ జూదం వల్లే నలదమయంతులు కష్టాలుపడ్డారు. జూదం ఆడేవాళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా పోతాయని. అయినా వస్తుందని ఆశ, ఆ ఆశే సర్వం పోగొడుతుంది.

లక్ష్మీ దేవి అనుగ్రహం కోసము ( డబ్బు నిర్లక్ష్యము చేయకూడదు)

లెక్కించి ఏట పారెయ్యాలి ఎంచి ఏట్లో పారెయ్యమని మన పెద్దలు చెప్పిన మాట చద్ది మూట. ప్రతీది లెక్క చూసుకోవాలి. అలా మీరు నిర్లక్ష్యంగా ఉన్నారని అవతలివారికి తెలిస్తే వాళ్ళ మిమ్మల్ని మోసం చేద్దామనే మీ వద్దకు వస్తారు. ఈజీ మనీ మీ నుంచి వస్తుందంటే చుటూ మీకు రాంగ్ డైరెక్షన్ ఇచ్చేవారు చేరిపోతారు. దానితో సమస్యలు.

ఆర్థికంగా నష్టపోవటం. కేవలం మీరు లెక్కవేసుకోరు అన్నచిన్నపొరపాటు బ్రహ్మరాక్షసిగా మారి మిమ్మల్ని అధఃపాతాళానికి నెట్టి వేస్తుంది. కోసం, ధనం కోసం ఎవరైనా ఏదయినా చేస్తారు. కావాలనుకుంటే మీ మీ వ్యవహారాల్లో టెస్ట్ చేసుకోండి. ఇప్పటివరకూ ఎంత నష్టపోయిందీ తెలుస్తుంది.

lakshmi goddes of wealth and how to attract her blessings?

వ్యసనాలుకుడా ధనాన్ని పోగొడతాయి

మద్యం, జూదం - బలహీనతలు మానవసహజం. కానీ ఆ బలహీనతలు తెలియకూడని వారికి తెలిస్తే పగపట్టిన పాము ఏ వైపు నుంచి వచ్చి కాటు వేస్తుందో తెలియనట్టు మిమ్మల్ని ఆ బలహీనతలనే ఉచ్చులో వేసి బిగిస్తారు. మీరెంతటి ధనవంతులైనా, తెలిసేసరికి అంతా కరిగిపోతుంది. ధర్మరాజు జూద బలహీనత తెలిసే దుర్యోధనుడు పిలిపించి మాయా జూదంతో సర్వం పోగొట్టి అడవులకి పంపాడు.

ఆ జూదం వల్లే నలదమయంతులు కష్టాలుపడ్డారు. జూదం ఆడేవాళ్ళందరికీ తెలుసు ఖచ్చితంగా పోతాయని. అయినా వస్తుందని ఆశ, ఆ ఆశే సర్వం పోగొడుతుంది. పోయిన చోటే వెతకాలి. నిజమే. కొన్ని ప్రదేశాల్లో పోయినవి తిరిగి వచ్చినా స్వీకరించకూడదు. ప్రయత్నించకూడదు.

ధన అహంకారమే దరిద్రుణ్ణి చేస్తుంది ధనాన్నీ, భార్యనీ నిర్లక్ష్యం చేస్తే దూరమవుతాయి. డబ్బులున్నప్పడు ఆ ధన అహంకారంతో గొప్పకోసం, కీర్తికోసం విచ్చలవిడిగా ఖర్చుపెడితే మిగిలేది దుఃఖం. లక్షలు వేలు ఖర్చుపెట్టిన చేతులు వందరూపాయలకి కూడా చాపాల్సి వస్తుంది.

సంపద ఉన్నప్పుడు పక్కన చేరిన వారంతా మిమ్మల్ని హీరోగా చేస్తారు. వారి అవసరాలనీ, సరదాలనీ, వ్యసనాలనీ మీ మీద రుద్దుతారు. మీరే వారి జీవితంలా ప్రవర్తిస్తారు. అంతా అవ్వగానే ఎవ్వరూ కనపడరు. అంతవరకైతే పర్వాలేదు. మీకే వ్యతిరేకంగా మాట్లాడతారు.

మీ శత్రువులతో, విరోధులతో చేరిపోతారు. ఆ శార్య అహంకారాల తోనే రాజులనుంచి మహాసంపదలు తెచ్చి ధర్మరాజు రాజసూయయాగం చేశాడు. సకలరాజకోటి చేత జేజేలు కొట్టించు కున్నాడు. నరదిష్టిని పొందాడు. నెలరోజుల్లోనే కట్టుబట్టలతో మాయాజూదంలో ఓడి అరణ్యవాసానికి సోదరులతో, ద్రౌపదితో వెళ్ళాల్సి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+