వంటగదిలో దేవుడి ఫొటోలుంటే వాస్తు ప్రకారం ఏం చేయాలో తెలుసుకోండి

కొంతమంది వంట గదుల్లో కూడా దేవుడి ఫొటోలు పెడుతుంటారు. వాస్తు ప్రకారం అలా పెట్టొచ్చా? లేదా? అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం. కొంతమందికి దేవుడి గది లేకపోవడం, ఈశాన్యం మూల ఎటువంటి సౌకర్యం ఉండకపోవడం జరుగుతుంటుంది. కొందరు ఈశాన్యం మూలన దేవుడి మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటుంటారు. మరికొందరు మాత్రం వంటగదిలో పెట్టడం లాంటివి చేస్తుంటారు. కొన్ని ఇళ్లల్లో వంటగదిలోనే దేవుడి గది ఆనుకొని ఉంటుంది. అప్పడు ఏం చేయాలనేది తెలుసుకుందాం.

ఇంట్లో వంటగది అనేది తూర్పువైపు ఆగ్నేయంగా ఉండాలి.
వంటగది ఇంటికి నాలుగో భాగం కంటే తక్కువగా ఉండాలి.
వంటగదిని, దేవుడి గదిని వేరు చేడానికి మధ్యలో సన్నటి గోడ కట్టండి.
లేదంటే రెండింటినీ వేరు చేస్తూ ఒక గుడ్డ లేదంటే కర్టెన్ పెట్టండి.
సాధ్యమైనంత వరకు ఈశాన్యం మూలన దేవుడి మందిరం పెట్టి పూజించుకోండి.

Learn what to do according to Vastu Shastra if you have pictures of deities in the kitchen

అపార్ట్ మెంట్ సంస్కృతి పెరిగిపోతుండటంతో చాలామంది వంటగదిలోనే చిన్న పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు.
వంటగదిలో ఈశాన్యం మూల ఉండాలి.
అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలి.
దేవుడి ఫొటోలను, విగ్రహాలను వంటగదిలో నేలమీద పెట్టొద్దు
కనీసం ఒక బల్ల లేదంటే పీట వేసి గోడకు ఉన్న అల్మారాలోనే పెట్టాలి.
పూజ చేసే సమయంలో ఉత్తర దిశ లేదంటే తూర్పు దిశ ఉండేలా చూసుకోవాలి.

వంటగది అనగానే పొగ, జిడ్డు ఉంటాయి.
దేవుడి ఫొటోలప అవి చేరకుండా నిత్యం శుభ్రం చేస్తుండాలి.
స్టవ్ పైన దేవుడి ఫొటోలు పెట్టొద్దు. సింక్ పైన కూడా పెట్టొద్దు.
వాస్తు ప్రకారం అది సరికాదు.
ఎంగిలి పాత్రలు కడిగేచోట దేవుడు ఉండటం సరికాదు.

దేవుడి ఫొటోల కింద లేదంటే పక్కన చెత్తబుట్ట లేకుండా చూసుకోవాలి.
వంటగదిలోని పూజ చేసే స్థలంలోఅద్దం ఉండకూడదు.
ప్రతికూలశక్తి ఆకర్షించి, సానుకూల శక్తిని పంపుతుంది.

వంటగదిలో దేవుడిని ఉంచడం వల్ల వంట చేసేటప్పుడు సానుకూల ఆలోచనలు కలుగుతాయి.
వంటగదిలో అన్నపూర్ణ దేవి ఫొటో పెట్టాలి.
దీనివల్ల ఆ ఇంట్లో ధాన్యానికి లోటుండదు.
వంటగదిలో మాంసాహారం వండుతుంటే దేవుడి ఫొటోలు ఉండటకపోవడం మంచిది.
లేదంటే తెర ఏర్పాటు చేసుకోవాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+