కొత్త సంవత్సరంలో మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తానన్న శనిదేవుడి వాగ్దానం.. కానీ

మరికొన్ని రోజుల్లో నూతన సంవత్సరం 2025లోకి ప్రవేశిస్తున్నాం. ఇక ఈ నూతన సంవత్సరంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెస్తుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో క్రమశిక్షణకు మారుపేరుగా, న్యాయదేవుడిగా పరిగణించే శని చాలా కీలకమైన భూమిక పోషిస్తాడు.

శనిని ప్రసన్నం చేసుకోవాలంటే చెయ్యాల్సిన పనులు
శని దయ ఉంటే కచ్చితంగా ఆ రాశి వారికి శుభమే జరుగుతుంది. శని దేవుడిని ప్రసన్నం చేసుకుంటే ఆర్థిక ఇబ్బందుల నుండి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొత్త సంవత్సరంలో శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనిదేవుడు విషయంలో కొన్ని పనులు చేస్తే మంచిదని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

Lord Shani promises to make you millionaires in 2025 These need to do for saturn blessings

శని దయ కోసం శనివారం ఇలా చెయ్యండి
ఇక 2025 సంవత్సరంలో శని దేవుడు అనుగ్రహం కోసం ప్రతి శనివారం శని దేవుడి ఆలయంలో ఆయన పాదాలకు నల్ల నువ్వులు, నూనె సమర్పించాలి. అంతేకాదు నూనె దానం చేయడం కూడా శనివారం రోజు చేసినట్లయితే అది శనికి అత్యంత సంతోషాన్ని కలిగిస్తుంది. నూనె దానం చేయాలనుకున్నవారు మీ ముఖాన్ని ఆ నూనెలో చూసి ఆ తర్వాత నూనెను అవసరమైన వ్యక్తికి దానం చేస్తే శనిదేవుడి కటాక్షం ఉంటుందని చెబుతున్నారు.

శని అనుగ్రహం కోసం ఆంజనేయ స్వామికి ఇలా చెయ్యండి
నూతన సంవత్సరంలో శని దేవుడి అనుగ్రహం కోసం శనివారం రోజు ఆంజనేయ స్వామికి కుంకుమ పూజ చేస్తే మంచిదని చెబుతున్నారు. అంతే కాదు హనుమాన్ చాలీసా పఠించి నిష్ఠతో హనుమంతుడిని ధ్యానం చేస్తే శని దేవుడు ఆగ్రహం నుండి కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెబుతున్నారు. ఎవరైతే హనుమంతుడిని విశ్వాసంగా కొలుస్తారో వారికి శని దేవుడి కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది.

శనిదేవుడిని పూజించేటప్పుడు ఈ తప్పు చెయ్యొద్దు
ఇక శని దేవుడికి నీలిరంగు పుష్పాలు అంటే చాలా ఇష్టం. శనిదేవుడిని పూజించే సమయంలో నీలిరంగు పుష్పాలను సమర్పించి శనివారం రోజు ఆచారాల ప్రకారం పూజలు చేయాలి. శనిదేవుని పూజించేటప్పుడు పొరపాటున కూడా ఆయనను నేరుగా చూడకూడదు. ఇక శని దేవుడి ప్రసన్నం చేసుకోవడం కోసం రావి చెట్టు వద్ద పూజ చేస్తే మంచిది.

రావి చెట్టు వద్ద ఇలా చేస్తే శని కటాక్షం
శనివారం సూర్యాస్తమయం తర్వాత నిర్జన ప్రదేశంలో ఉన్న రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేస్తే డబ్బు సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. మీకు దగ్గరలో రావి చెట్టు లేకపోతే ఆలయంలో కూడా దీపం వెలిగించవచ్చని చెబుతున్నారు.

పేదరికం పోవాలంటే శని దేవుడి కోసం ఇలా చెయ్యండి
అంతే కాదు రావి చెట్టుకు క్రమం తప్పకుండా నీళ్లను సమర్పించడం, రావి చెట్టుకు ఏడుసార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా కూడా శని దేవుడి కటాక్షం ఉంటుందని చెబుతున్నారు. ఎప్పుడైతే శని దేవుడి అనుగ్రహం ఉంటుందో అప్పుడు మీ పేదరికం తొలగిపోతుందని, జీవితం సుఖంగా ఉంటుందని చెబుతున్నారు. కనుక 2025లో ఈ పనులు చేసి శని దేవుడి అనుగ్రహాన్ని పొందితే జీవితం సంతోషంగా సాగుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+