మీనరాశిలో అరుదైన కలయిక.. ఈ రాశులపై లక్ష్మీదేవి కనకవర్షం
గ్రహాలు ప్రతి నెలా తమ రాశులను మారుస్తుంటాయి. మార్చిలో కూడా గ్రహాలు సంచారం జరపబోతున్నాయి. వచ్చేనెల ఏడోతేదీన బుధుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆ రాశిలో రాహువు ఉంటాడు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత బుధుడు, రాహువు మీనరాశిలో కలవబోతున్నారు. ఇటువంటి అరుదైన కలయిక, గ్రహాల సంయోగం కొన్ని రాశులవారికి బాగా కలిసిరానుంది. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృశ్చికరాశి
బుధుడు, రాహువు కలయిక ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. కొత్తగా వివాహమైనవారికి సంతాన యోగ్యత ఉంది. ప్రేమ జీవితం కూడా విజయవంతమవుతుంది. సంపద రెట్టింపు అవడంతోపాటు పొదుపు చేస్తారు. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో గడుస్తుంది. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో మద్దతు లభించడంతో అన్ని పనులను ఆత్మవిశ్వాసంతో పూర్తిచేస్తారు.

మీనరాశి
సమాజంలో వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కెరీర్ లో మంచి పురోగతి ఉంది. శత్రువులపై విజయం సాధించడంతోపాటు నలుగురికి సహాయం చేస్తారు. ఈ సమయం వ్యాపారస్తులకు బాగా కలిసివస్తుంది.
వృషభ రాశి
కెరీర్ లో ఊహించని స్థాయికి వెళతారు. పెట్టే పెట్టుబడులన్నీ కనక వర్షం కురిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయి. ఆర్థికంగా మంచిస్థాయికి చేరుకుంటారు.
కర్కాటక రాశి
అన్ని పనుల్లో మంచి ఫలితాలను పొందుతారు. సంపద రెట్టింపు అవడంతోపాటు విదేశాల్లో చదవాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వ్యాపార రీత్యా లేదంటే ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేస్తారు. ఇవి కూడా లాభసాటిగా ఉంటాయి.
సింహరాశి
ఈ రాశివారు అప్పులు తొలగిపోతాయి. ఆర్థికంగా బలపడతారు. వివాహం కానివారికి వివాహం కుదరుతుంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. చేస్తున్న పనిలో వృద్ధి చెందుతారు. అన్నిరకాలుగా ఈ సమయం బాగా కలిసివస్తుంది.












Click it and Unblock the Notifications