బుధుడి అనుగ్రహంతో ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం

నవగ్రహాల్లో బుధుడు కీలక గ్రహం. గ్రహాల రాకుమారుడు. గ్రహాల్లో అతి చిన్న గ్రహం కూడా ఇదే. తెలివితేటలు, తర్కం, వ్యాపారం, జ్ఞానానికి కారకుడు. జాతకంలో బుధుడు బలంగా ఉంటే తెలివితేటలమీదే జీవితంలో పైకొస్తారు. బుధుడి అనుగ్రహం ఉంటే ఆర్థికంగా బలపడతారు. ఆయన ఆశీస్సులు పొందితే అద్భుతమైన విజయాలు సొంతమవుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. బుధుడికి ఇష్టమైన, ఆయనవల్ల లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

కన్యా రాశి
ఈ రాశిలో జన్మించినవారికి బుధుడి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. వీరు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులతో గడపడానికి అధిక సమయాన్ని వెచ్చిస్తారు. వృత్తిలో స్థిరపడినవారికి బుధుడి నుంచి విపరీతమైన అనుగ్రహం లభిస్తుంది. దీనివల్ల వారు విజయాలు అలవోకగా సాధిస్తుంటారు. డబ్బుల పరంగా అదృష్టం తోడుంటుంది. మంచి సంపదను పొంది జీవితంలో స్థిరపడతారు. అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. మంచి పనితీరుతో జీవితంలో ముందుకు సాగుతారు. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బుధుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే అనేక లాభాలను పొందుతారు. పెళ్లికానివారికి పెళ్లి కుదురుతుంది.

mercury favourite zodiac signs will get huge money

మిథున రాశి
కళల రంగంలో ఉన్నవారు అద్భుతమైన లాభాలను అందుకుంటారు. విద్యారంగానికి సంబంధించినవారికి విశేషమైన లాభాలను పొందుతారు. బుధుడి అనుగ్రహంతో జీవితం ఉల్లాసంగా గడుస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలున్నవారి జీవితం మెరుగ్గా ఉంటుంది. తెలివితేటలు పెరుగుతాయి. వాటితోనే జీవితంలో రాణిస్తారు. డబ్బుల పరంగా ఇబ్బంది ఉండదు. జీవితం ఆకర్షణీయంగా మారుతుంది. ఈ రాశివారు పర్యాటక రంగానికి సంబంధించిన సంస్థల్లో ఉద్యోగాలు చేస్తారు. విశేషంగా రాణిస్తారు. వీరికి అన్నివిధాలుగా ఆరోగ్యం సహకరిస్తుంది. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయడంతోపాటు బుధుడిని పూజించడంవల్ల అన్నిరకాల పనులు త్వరగా పూర్తవుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+