మేషరాశిలోకి బుధుడు... ఈ రాశులవారికి అదృష్టం
గణితం, వ్యాపారం, తార్కిక శక్తి, వాక్కు, ఆర్థిక వ్యవస్థకు ప్రధాన కారకం బుధ గ్రహం. ఈ గ్రహం కదలికలో మార్పు వచ్చినప్పుడల్లా ఈ రంగాలన్నీ ప్రభావితమవుతుంటాయి. గ్రహాలకు రాకుమారుడైన బుధుడు మేషరాశిలోకి ప్రవేశించడంవల్ల తులా రాశి, మీన రాశి, సింహ రాశి వారికి అదృష్టం కలిసివస్తోంది. వారికి ఏ విధంగా కలిసిరానుందో తెలుసుకుందాం.
మీన రాశి
మీన రాశి వారికి ఈ మార్పు అనుకూలంగా ఉంటుంది. మీన రాశి రెండో ఇంట్లో బుధ సంచారం జరిగింది. ఈ సమయంలో ధన ప్రవాహం ఉంటుంది. దీంతో పాటు ప్రసంగంలో, డబ్బులో, మాటలో ప్రభావం కనిపిస్తుంది. ప్రజలు మిమ్మల్ని ఆకట్టుకుంటారు. డబ్బు సంపాదించడానికి పలు మార్గాలు కనపడతాయి. పూర్వీకుల ఆస్తి నుంచి ప్రయోజనం, విదేశాల నుండి లాభం పొందవచ్చు. ఇతరుల దగ్గర చిక్కుకు పోయిన డబ్బును పొందేతారు. శనీశ్వరుడి సగభాగం మీపై ఉండటంవల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

సింహ రాశి
బుధుడు మేషరాశిలో జూన్ 7 వరకు ఉండటంవల్ల సింహ రాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఈ రాశి ద్వారా బుధ గ్రహం అదృష్ట స్థానంలో ప్రయాణిస్తుంది. కోరికలు నెరవేరడంతోపాటు అదృష్టం కలిసివస్తుంది. కెరీర్ పరంగా అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగంలో సంతృప్తి ఉండటంతోపాటు పదోన్నతికి అవకాశాలుంటాయి. మతపరమైన లేదా పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొంటారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్, లాటరీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇది అనుకూల సమయం. ఉద్యోగ పరంగాకానీ, వ్యాపార పరంగా కానీ దూర ప్రయాణం ఉంటుంది. అది ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది.
తులా రాశి
తులారాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి నుండి ఏడో ఇంట్లో సంచారం జరగడంతో భాగస్వామ్య వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులకు చాలా లాభంగా ఈ సమయం మారుతుంది. పదోన్నతికి అవకాశం ఉండటంతోపాటు జీవిత భాగస్వామి విషయంలో పురోగతి ఉంటుంది. డబ్బును ఆదా చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.












Click it and Unblock the Notifications