వృషభరాశిలోకి బుధుడు.. నక్క తోకను తొక్కినట్లే
ఏ వ్యక్తి జాతకంలోనైనా సూర్యుడు, బుధుడు కలిసివుంటే ఆ వ్యక్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. ఈ నెల 8వ తేదీ నుంచి బుధుడు వృషభరాశిలోకి ప్రవేశించాడు. అప్పటికే ఆ రాశిలో సంచరిస్తున్న సూర్యుడితో కలుస్తుంది. ఈ రెండింటి కలయిక 16వ తేదీ వరకు ఉంటుంది. దీని ప్రభావం వల్ల ఎటువంటి సమస్యలు రాకుండా, కలతలు లేకుండా మనశ్శాంతి ఏర్పడుతుంది. 12 రాశులవారికి ఈ రెండు గ్రహాల కలయిక ఏవిధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం.
మేష రాశి : ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో సలహాలకు ప్రాధాన్యం ఇస్తారు.

వృషభ రాశి : ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. అనారోగ్యానికి మంచి వైద్యం దొరుకుతుంది. సేవా కార్యక్రమాలకు విరాళాలిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. వృత్తి నిపుణులకు మంచి అవకాశాలు తలుపు తడతాయి.
మిథున రాశి : కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలతో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటే వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు.
కర్కాటకరాశి : ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మేలు చేస్తాయి. సానుకూల దృక్పథం ముఖ్యం. అదృష్టం తోడుంటుంది. చిన్న చిన్న ప్రయత్నాలతో జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి.
సింహ రాశి : అధికారులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బయటకు వస్తాయి. చిన్న ప్రయత్నం మంచి విజయాన్ని అందిస్తుంది. వీసాతోపాటు వాహన, గృహ సమస్యల పరిష్కారానికి మార్గం దొరుకుతుంది.
కన్యా రాశి : నెలరోజులపాటు జీవితం ఉత్సాహంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి.












Click it and Unblock the Notifications