రాశిని మారుస్తున్న బుధ గ్రహం.. ఉగాది తర్వాత వీరికి బంగారమే!
బుధుడి రాశి పరివర్తనం కారణంగా మేష రాశివారిలో ధైర్యం పెరుగుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ నెలాఖరులో బుధుడు రాశిని మారుస్తున్నాడు. మీన రాశి నుంచి మేషరాశిలోకి వెళతాడు. దీనివల్ల కొన్ని రాశులవారిపై ప్రభావం ఉండి వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని పండితులు చెబుతున్నారు. రాశుల పరివర్తనానికి జ్యోతిష్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఈ ప్రభావం కొన్ని రాశులవారికి శుభాలను కలిగిస్తే.. మరికొందరికి అశుభాలను తీసుకొస్తుంది. త్వరలోనే బుధగ్రహం తన రాశిని మార్చబోతోంది. ఈనెల 31వ తేదీన బుధగ్రహం మేష రాశిలోకి ప్రవేశిస్తోంది. మీనం నుంచి బయటకు వచ్చిన తర్వాత మేషరాశిలోకి బుధుడు వెళతాడు. మేషరాశిలో బుధుడి సంచారం కారణంగా మూడు రాశులవారికి అదృష్టం కలిసివస్తుందని చెప్పవచ్చు.

మేషం (Aries):
బుధ సంచారంతో వీరిలో ధైర్యం పెరుగుతుంది. అంతేకాదు.. వీరి వ్యక్తిత్వం మెరుగుపడే అవకాశాలున్నాయి. ఈ సమయంలో మీరు మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో బంధువులను, స్నేహితులను మెప్పించగలుగుతారు. మీడియా, బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నవారు ధనలాభం పొందుతారు. ఉద్యోగం మారాలని చూస్తున్న వారు శుభవార్త వినడంతోపాటు సోదరుడు, స్నేహితుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది.

కర్కాటకం (Cancer):
బుధుడి సంచారం వీరికి అదృష్టాన్ని తెస్తుంది. మీ పనితీరును ఆఫీసులో అందరూ కొనియాడతారు. అంతేకాదు.. కొత్త బాధ్యతలు కూడా చేపట్టాల్సి వస్తుంది. ఈ సమయంలో మీ కుటుంబంలో కొన్ని శుభ కార్యాలు జరగవచ్చు. కన్నతల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఆమె నుంచి మీకు ఆర్థిక ప్రయోజనాలుంటాయి.

కుంభం (Aquarius):
బుధుడి రాశిపరివర్తనంతో కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. సుదూర ప్రాంతాలకు సంబంధించి తీర్థయాత్రలకు వెళ్లే అవకాశముంది. అదృష్టం కలిసివచ్చి వ్యాపారంలో లాభాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమేకాక ఆర్థిక కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది రాదు.
ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తుందని మనకు తెలిసిందే. పూర్వం అయితే పండగపూట విసనకర్రలు దానం చేసేవారు. ఉగాది పూజను దమనంతో చేయాలి. దమనమనేది సుగంధం తో ఉండే ఆకు. దీనితో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందడమే కాదు.. పండగరోజు ఉగాది పచ్చడి చేసుకుని తప్పకుండా తినాలి












Click it and Unblock the Notifications