ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్లు
Recommended Video

డా.యం.ఎన్.చార్య- శ్రీమన్నారాయణ ఉపాసకులు ,ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష పండితులు -9440611151
జ్ఞాననిధి , జ్యోతిష అభిజ్ఞ , జ్యోతిష మూహూర్త సార్వభౌమ"ఉగాది స్వర్ణ కంకణ సన్మాన పురస్కార గ్రహీత"
ఎం.ఏ జ్యోతిషం - పి.హెచ్.డి "గోల్డ్ మెడల్" ,ఎం.ఏ తెలుగు (ఏల్) , ఎం. ఏ సంస్కృతం , ఎం.ఏ యోగా ,
యోగాలో అసిస్టెంట్ ప్రోఫెసర్ శిక్షణ ,ఎం.మెక్ ఎపిపి, పి.జి.డిప్లమా ఇన్ మెడికల్ ఆస్ట్రాలజి (జ్యోతిర్ వైద్యం) ,
పి.జి.డిప్లమా ఇన్ జ్యోతిషం, వాస్తు , మరియు రత్న శాస్త్ర నిపుణులు.
సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక-హైదరాబాద్.
ఏంతో ఖర్చులు చేసి అన్ని హంగు ఆర్భాటాలు చేస్తారు కాని ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వక పోవటం
చాలా తప్పు. దీని వలన వచ్చే నష్టం నూతన దంపతుల మధ్య
అన్యోన్యత లేకపోవటం భార్యా భర్తలు మంచి సంతానం పొందక పోవటం
జరుగుతుంది.
వధు వరుల జాతక పొంతనాలు కలువకపొయినా పెళ్ళిళ్ళు జరిపించడం.జ్యోతిష పండితులు నిర్ణయించిన మూహూర్తాన్ని కాదని మన అనుకూలతలకోరకు ఆదివారాలు లేదా సెలవు రోజులు కలిసి వచ్చేలా అందులో మధ్యాహన్న సమయంలో బలవంతంగా పంతులతో మూహూర్తాలు పెట్టించుకోవడం చాలా తప్పు.
అసలు వధు వరుల జాతకాలు కలవక పోతే వివాహానికి అడుగు ముందుకు వేయకూడదు.ఇరువురి జాతకాలలో పొంతనలో ఏమైన దోషాలు ఉంటే వాటిని విధిగా పరిహార ప్రక్రియలు పాటించాలి.సిద్దాంతులు గ్రహా బలా బలాలు చూసి ఏ సమయానికి మూహుర్తం నిర్ణయిస్తే అదే సమయానికి వివాహం జరిపించు కోవాలి.సౌలబ్యం కోసం పగటి పెళ్ళీళ్ళె కావలని బలవంతపు ముహూర్తాలు పెట్టించుకోవద్దు.

పెళ్ళి తంతులో పంతులన్ను మంత్రాలు చదవనీయకుండా త్వరగా కాని అని హడావిడి చేయడం కన్యదానం సమయంలో పూజమీద మనస్సు పెట్టక వచ్చిన బంధు మిత్రులపై ద్రుష్టి పెట్టడం సరికాదు.
అబ్బాయిని ఎదురుకునే సమయంలో అనవసరమైన డ్యాన్స్ లని మూహూర్త కాలాన్ని హరించి వేయడం ఎంత మాత్రం సరికాదు.శాస్త్రీయతను వీడి పెళ్ళి బొట్టు స్టిక్కర్లు పెట్టడం పద్ధతి కాదు.
జీలకర్ర బెల్లం పెట్టాక వధు వరులు ఒకరి కళ్లలో ఒకరు చూపులు నిలపకపోవటం మానేసి ఈ మధ్య కాలంలో పంతులు చెప్పిన మాటల కంటే ఫోటో గ్రాఫర్ చెప్పిన మాటలకు ప్రధాన్యత ఇవ్వడం.అసలు మనం ఏటువైపు ప్రయణిస్తున్నాము ఒక సారి గ్రహించాలి.పెళ్ళి తంతు మరచి వీడియోలు ఫోటోల వైపు మాత్రమే చూడటం సరియైనది కాదు.
పోటోలు తీపి జ్ఞాపకాలే కానీ ధర్మం ఆచరించాకే మిగతావి
దీని వలన కలిగే నష్టం
వారి మధ్య ప్రేమ లోపించటం
ఫోటోలు వీడియోలపై తమ దృష్టంతా ఉంచటం
దీనివలన కలిగే నష్టం
సంస్కారం లోపించడం జరుగుతుంది.
తలబ్రాలకు బదులు ప్యాషన్లకు పోయి లేదా ఫోటోలు బాగవస్తాయని థర్మాకోల్ మరియు రంగుల గుండ్లు పోసుకోవటం
దీని వలన
బంధు ద్వేశం ఆర్దిక ఇబ్బదులు కలుగుతాయని గ్రహించలేకపోతున్నారు.
పెళ్ళి జరిగాక వధు వరులను ఆశీర్వదించడానికి బంధువులు చెప్పులు వేసుకొని కళ్యాణ మండపం లోనికి రావటం వధూవరులని ఆశీర్వదించటం
దీనివలన మంటపంలో ఉండే దేవతలు వెళ్లిపొయి జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనటం జరుగుతుంది.
అతిధి భోజనాలు అనేది ప్రస్తుత కాలంలో పాత పద్దతులను మరచి అవమానంగా భావించి బఫే భోజనాలు పెడుతున్నారు
దీని వలన అన్నదాన ఫలితం పొందక పోవటం జరుగుతుంది.
వేదమంత్రాలు మైకుల్లో వినకుండా వాటి స్థానంలో సినిమా పాటలు వినటం
దీని వలన దైవ కటాక్షం దూరమవ్వడానికి ఎంతలా తయారు అవుతున్నామో ఆలోచించాలి.ఇవేకాక ఇంకా చాలా పొరపాట్లు ఉన్నాయి అవన్నీ గ్రహించి శాస్త్రీయ విధానంగా వివాహం జరుపుకొని భగవంతుడి కృపకు పాత్రులై మంచి జీవితం గడుపుతూ మంచి సంతానం పొంది పదిమందికీ ఆదర్షంగా నిలవండి.పండితులు నిర్ణయించిన మూహూర్తానికే పెళ్ళి జరిపించుకునేలా జాగ్రత్త పడటం మంచిది.ఇలా చేస్తే నూతన జంటలు కళకాలం హాయిగా ఉంటారు.
మనం ఒక జంటను కలుపుతున్నాం అంటే వారు జీవితాంతం సంతోష పడేలా ఉండాలి కాని తిట్టుకునేలా ఉండకూడదు.ఈ సత్కార్యనికి పాలుపడిన మంచి చెడులకు ఫలితం మనకు వర్తిసుంది ఇది గుర్తుంటే చాలు లోక కళ్యణంలో మన పాత్ర దైవత్వం పొందినదై ఉండాలి. జై శ్రీమన్నారాయణ.












Click it and Unblock the Notifications