Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిథున సంక్రాంతి.. పొరపాటున గానీ

Mithuna Sankranti 2025: రేపు.. మిథున సంక్రాంతి. 2025 జూన్ 15వ తేదీన సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దీన్ని మిథున సంక్రాంతిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సూర్య భగవానుడిని పూజించడానికి, ఇతర ఆధ్యాత్మిక ఆచారాలకు ఇది అనుకూలమైనదిగా పెద్దలు చెబుతారు.

మిథున సంక్రాంతి 2025: ఎప్పుడు?

సూర్యుడు వృషభ రాశి నుండి మిథున రాశికి మారిన కాలాన్ని మిథున సంక్రాంతిగా పరిగణిస్తారు. ప్రతి నెలా వచ్చే 12 మాస సంక్రాంతుల్లో ఇదీ ఒకటి. హిందూ ఆచార వ్యవహారాల్లో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీన్ని మిథున సంక్రమణంగా పిలుస్తారు. మిథున సంక్రాంతి పుణ్య కాలం ఆదివారం తెల్లవారు జామున 6:53 నిమిషాలకు ఆరంభమౌతుంది. మధ్యాహ్నం 2:19 నిమిషాల వరకు ఉంటుంది. మిథున సంక్రాంతి మహా పుణ్యకాలం.. తెల్లవారు జామున 6:53 నిమిషాల నుండి ఉదయం 9:12 వరకు ఉంటుంది.

మిథున సంక్రాంతి పుణ్యకాల ముహూర్తం

మిథున సంక్రాంతి పుణ్యకాలం వివరాలు ఇలా ఉన్నాయి..

సంగ్రహణం తేదీ, సమయం
మిథున సంక్రాంతి ఆదివారం, జూన్ 15, 2025
మిథున సంక్రాంతి పుణ్య కాలం తెల్లవారు జామున 6:53 నుండి మధ్యాహ్నం 2:19 వరకు
మిథున సంక్రాంతి మహా పుణ్య కాలం తెల్లవారు జామున 6:53 నుండి ఉదయం 9:12 వరకు
మిథున సంక్రాంతి ఆరంభ కాలం తెల్లవారు జామున 06:53

మిథున సంక్రాంతి ప్రాముఖ్యత

మిథున సంక్రాంతికి జ్యోతిష్యపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. మిథున రాశిలో సూర్యుడి సంక్రమణం- మన జీవితాన్ని, ప్రకృతిని ప్రభావితం చేస్తుందని పెద్దలు చెబుతారు. సూర్య భగవాడిని పూజించడానికి ఇది అత్యంత పవిత్రమైన సమయం. ఈ సమయంలో పూజలు, దానాలు చేయడం, ఉపవాసాలు ఉండటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయి. మిథున సంక్రాంతి కాలంలో పేదలకు ఆహారం, దుస్తులు, ధాన్యం దానం చేయడం ఉత్తమ ఫలితాలు లభిస్తాయి.

మిథున సంక్రాంతి నాడు ఏం చేయాలి?

మిథున సంక్రాంతి అనేది ఆధ్యాత్మిక సాధనలకు, దానధర్మాలకు ఎంతో అనుకూలమైన సమయం. దీనిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చు.

ఉదయాన్నే నిద్రలేచి, పవిత్ర నదిలో స్నానం చేయాలి. ఆ అవకాశం లేనప్పుడు ఇంట్లో చన్నీటి స్నానం చేయవచ్చు. ఆ సమయంలో సూర్య మంత్రాలను జపించాలి. సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఉపవాసం ఉండాలి. బ్రాహ్మణులకు లేదా పేదలకు బట్టలు, ఆహారం, బెల్లం లేదా బంగారం వంటి వాటిని దానం చేయాలి. ఏదైనా దేవాలయాలన్ని సందర్శించాలి. ఇంట్లో సూర్య భగవాడిని పూజించాలి.

దక్షిణాది రాష్ట్రాల్లో అనేక ప్రాంతాలలో మిథున సంక్రాంతిని కాలానుగుణ మార్పులకు సూచికగా కూడా జరుపుకొంటారు. కాల పరివర్తనకు ఇది ఆరంభంగా భావిస్తారు. అంటే వేసవిలో ఎండ తీవ్రత తగ్గిపోయి, వర్ష రుతువు ప్రారంభమౌతుందన్నమాట. రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే సమయంగా రైతులు ఈ మిథున సంక్రాంతిని జరుపుకొంటారు. ప్రకృతిలో సంభవించే మార్పులకు సంకేతంగా భావిస్తారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+