సింహరాశిలో చంద్రుడి సంచారం.. 4 రాశులవారికి అదృష్టయోగం

మనసు స్థిరంగా ఉన్నా, చంచలంగా ఉంటుందన్నా దానికి కారకుడు చంద్రుడు. ప్రస్తుతం ఆయన సింహరాశిలో సంచరిస్తున్నాడు. దీనివల్ల తల్లి ప్రేమను పొందడంతోపాటు ఆమె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సమాజంలో హోదా పెరగడం, మంచి కార్యాలు జరుగుతాయి. అయితే సింహరాశిలో చంద్రుడు సంచారం చేయడంవల్ల నాలుగు రాశులవారికి మాత్రమే బాగుంటుంది. వారికి కొన్నిరకాల యోగాలను ఇవ్వబోతున్నాడు. అవేంటో పరిశీలిద్దాం.

మేష రాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మాట చెల్లుబాటవుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రాజెక్టులు లేదంటే ప్రణాళికలు తయారుచేసే రంగంలో ఉన్నవారికి బాగుంటుంది. పాజిటివ్ గా ఆలోచించాలి. ఏ చిన్న ఆలోచనను అమల్లో పెట్టినా అది నెరవేరుతుంది. క్రియేటివ్ రంగంలో ఉన్నవారు నెగెటివ్ ఆలోచనలను మానుకోవాలి.

 zodiac signs

కర్కాటక రాశి:
బంధుమిత్రుల్లో పలుకుబడి పెరుగుతుంది. గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. ఆర్థికంగా మెరుగవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు సహాయం కూడా చేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పిల్లలకు సంబంధించి లేదంటే కుటుంబానికి సంబంధించి మంచి వార్తలు చెవిన పడతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉద్యోగంలో స్థిరపడతారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.

తులా రాశి: వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనపడుతుంది. అధికారులతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో పెద్ద నుంచి ఆస్తి వస్తుంది. ఆదాయపరంగా అభివృద్ధి సాధిస్తారు. పాజిటివ్ గా ఆలోచించడంవల్ల అందుకు తగ్గట్లుగా పనుల ఫలితాలు కూడా ఉంటాయి. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. అలాగే పిల్లలకు సంబంధించి శుభవార్త వింటారు.

ధనుస్సు రాశి: భాగ్య స్థానంలో చంద్రుడి సంచారం వల్ల తల్లి ప్రేమను పొందుతారు. ఆమె నుంచి ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. విదేశాలలో ఉద్యోగానికి లేదంటే విదేశీ యానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు చేయడం, సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం, వితరణ కార్యక్రమాలు చేపట్టడం లాంటివి జరుగుతాయి. ఔదార్యం ఎక్కువ కావడం, ఇతరులకు సహాయం చేయాలనే తపన పెరుగుతుంది.

 zodiac signs a

ఇతర రాశులు: వీరికి అనుకూలంగా లేదు. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. తల్లివైపు బంధువుల వల్ల ఆర్థికంగా నష్టం జరగడంతోపాటు మానసికంగా చాకికులు తలెత్తి ప్రశాంతతను కోల్పోతారు. సన్నిహితులతో విభేదాలు వస్తాయి. ఇతర రాశులవారంతా లలితా సహస్రనామం లేదా దుర్గా స్తోత్రం వంటివి పారాయణ చేయాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+