Moral stories: కాకికి దొరికిన వడ – నక్క వేసిన ఎత్తు

ఒక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టుపై ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ కాకికి ఎక్కడో రుచికరమైన వడ దొరికింది. దాన్ని ముక్కుతో కరుచుకుని, హాయిగా తినడానికి ఆ మర్రి చెట్టు కొమ్మపై వాలింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఒక నక్కకు ఆకలి వేస్తోంది. పైనున్న కాకి ముక్కులో ఉన్న వడను చూసి దాని నోరూరింది. ఎత్తుగా ఉన్న చెట్టు కొమ్మపైకి నక్క ఎక్కలేదు కాబట్టి, ఎలాగైనా ఆ వడను కింద పడేలా చేయాలని ఒక ఉపాయం ఆలోచించింది.

Moral stories: పంచతంత్రంలో నక్క - నీలం రంగు తొట్టి
Moral stories: పంచతంత్రంలో నక్క - నీలం రంగు తొట్టి

కాకీ.. నీ అంత అందమైన పక్షి మరోటి లేదు

నక్క చెట్టు కిందకు వచ్చి పైకి చూస్తూ, "అమ్మా కాకి! నీ నల్లని మెరిసే ఈకలు ఎంత అందంగా ఉన్నాయి! అడవిలో ఇంత అందమైన పక్షి మరొకటి లేదు. నీ గొంతు కూడా అంతే తియ్యగా ఉంటుందని విన్నాను. ఒక్కసారి నీ పాట వినిపించి నన్ను తరించేలా చేయి" అని ఎంతో వినయంగా పొగిడింది. నక్క మాటలకు కాకి పొంగిపోయి, తనను ఎవరూ ఇంతలా పొగడలేదని గర్వపడింది. నక్క మాటల్లోని కుతంత్రాన్ని గ్రహించలేక, పాట పాడదామని ముక్కు తెరిచింది.

Moral stories: తెనాలి రామకృష్ణ చెప్పిన అసలైన నిద్ర రహస్యం!
Moral stories: తెనాలి రామకృష్ణ చెప్పిన అసలైన నిద్ర రహస్యం!
Moral stories The Crow s Vada and the Fox s Cunning Plan

కింద పడిన వడ

కాకి ముక్కు తెరవగానే అందులో ఉన్న వడ జారి కింద పడింది. అప్పటికే కాచుకుని ఉన్న నక్క, ఆ వడను చటుక్కున నోట కరుచుకుని అక్కడి నుంచి పారిపోయింది. వడ పోయిందని తెలుసుకున్న కాకి, తన అవివేకానికి ఎంతో బాధపడింది. ఈ కథ ద్వారా ఎవరైనా మితిమీరి పొగుడుతున్నారంటే వారి వెనుక ఏదో స్వార్థం ఉండొచ్చని, దానివెనక ఒక మతలబు ఉంటుందని గ్రహించాలని, పొగడ్తల మాయలో పడకుండా వివేకంతో ఆలోచించి మన దగ్గర ఉన్న విలువైన విషయాలను కాపాడుకోవాలనేది నీతి. ఇది ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+