నవరాత్రుల ప్రత్యేకం: శైలపుత్రి ఎవరు?
నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికి పూజలు, ఉపాసనలు జరుపబడును.
వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృత శేఖరామ్
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్
దుర్గామాత మొదటి స్వరూపము శైలపుత్రి నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము ఏర్పడినది. వృషభవాహనారూఢయైన ఈ మాత కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.
పూర్వజన్మమున ఈమె దక్షప్రజాపతికి పుత్రిక. అప్పుడీమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరించెను. దేవతలను తమతమ యజ్ఞభాగములను స్వీకరించుటకై దక్షుడు ఆహ్వానించెను. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞమునకు పిలువలేదు. తనతండ్రి ఒక మహాయజ్ఞమును చేయుచున్న విషయము ఆమెకు తెలిసెను.ఈ యజ్ఞమిషతోనైనను అచటికి వెళ్లి, తన తల్లిని, తోబుట్టువులను చూడవచ్చునను కోరిక ప్రబలముగా ఉండుటచే అనుమతికై ఆమె పట్టుబట్టెను. ఆమె పట్టుదలనుజూచి, శంకరుడు ఆమెను అనుమతించెను.

సతీదేవి తన తండ్రి యింటికి చేరినప్పుడు అచటవారెవ్వరును ఆమెతో మాట్లాడలేదు. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరముగా మాట్లాడెను. ఇదంతయు చూచిన సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోయెను. పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికి వచ్చి, పెద్దపొరపాటే చేసితిని - అని ఆమె తలంచెను.
తన పతియైన పరమేశ్వరునకు జరిగిన ఈ అవమానమును ఆమె సహింపలేకపోయెను. వెంటనే ఆమె తన రూపమును అచటనే యోగాగ్నిలో భస్మమొనర్చెను. ఆశనిపాతమువలె దారుణదుఖకరమైన ఈ సంఘటనను గూర్చి విని పరమశివుడు మిక్కిలి క్రుద్ధుడాయెను ఆయన తన ప్రమథగణములను పంపి దక్షుడు యజ్ఞమును పూర్తిగా విధ్వంసమొనర్చెను.
సతీదేవి యోగాగ్నిలో తన తనువును త్యజించి, మఱుజన్మలో శైలరాజైన హనుమవంతునకు పుత్రికగా అవతరించెను. ఇప్పుడామె శైలపుత్రిగా రూఢికెక్కెను. పార్వతి, హైమవతి అనునవియును ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథననుసరించి, ఆమె హైమవతీ రూపమువ దేవతల గర్వమును అణచెను.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications