నవపంచమ రాజయోగంతో నక్కతోక తొక్కి కోటీశ్వరులయ్యేది వీరే

వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. అయితే మే నెలలో ఒక అద్భుతమైన రాజయోగం ఏర్పడబోతోంది. మే 22వ తేదీన గురువారం మధ్యాహ్నం 12 గంటల ఎనిమిది నిమిషాలకు చంద్రుడు మీన రాశిలో ప్రవేశిస్తాడు. గురువు మిధున రాశిలోకి ప్రవేశిస్తాడు.

నవ పంచమ రాజయోగం
ఈ రెండు గ్రహాలు నవ పంచమ స్థానాలలో ఉండడం వల్ల నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. నవ పంచమ రాజయోగంతో అదృష్టాన్ని పొందే ఆ రాశులను గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

navpancham rajyoga brings happiness to these zodiac signs lives soon

మిధున రాశి
నవ పంచమ రాజయోగంతో మిధున రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. నవ పంచమ యోగం కారణంగా మీరు కోరుకున్న ఉద్యోగాలు లభిస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. మిధున రాశి జాతకులు అన్ని రంగాలలో విజయం సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు.

కుంభరాశి
నవ పంచమ రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. ఈ రాజయోగం కుంభ రాశి వారికి శుభాలను చేకూరుస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగంలోనూ ఉన్నతి కనిపిస్తుంది. కుంభ రాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కుంభ రాశి వారికి నవ పంచమ యోగం కారణంగా చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి. బయట ఎప్పటినుండో వసూలు కానీ బాకీలు ఈ సమయంలో వసూలవుతాయి.

మీనరాశి
మీన రాశి జాతకులు నవ పంచమ రాజయోగంతో అదృష్ట జాతకులుగా మారుతున్నారు. మీన రాశి వారు ఈ సమయంలో మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. వీరికి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీనరాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. సంపద పెరిగే అవకాశం ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి.

disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+